Leading News Portal in Telugu

GST Notice to IIT Delhi: ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్ల జీఎస్టీ నోటీసు.. కేంద్ర విద్యాశాఖ జోక్యం!


  • ఐఐటీ ఢిల్లీకి 120 కోట్ల జీఎస్టీ నోటీసు

  • కేంద్ర విద్యాశాఖ జోక్యం

  • ఆర్థిక శాఖతో మంతనాలు
GST Notice to IIT Delhi: ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్ల జీఎస్టీ నోటీసు.. కేంద్ర విద్యాశాఖ జోక్యం!

విద్యాశాఖకు జీఎస్టీ నోటీసులు ఇవ్వడంపై దుమారం రేపుతోంది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి జోక్యం పుచ్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐఐటీ-ఢిల్లీకి రూ.120 కోట్ల విలువైన జీఎస్‌టీ నోటీసు పంపించింది. 2017-2022 మధ్యకాలంలో ఐఐటీ-ఢిల్లీ అందుకున్న రీసెర్చ్ గ్రాంట్‌లపై జీఎస్టీ నోటీసు వచ్చింది. తమిళనాడు అన్నా యూనివర్సిటీకి కూడా రూ.5.4 కోట్ల GST నోటీసు వచ్చింది. అయితే దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. విద్యాశాఖకు సంబంధించిన వాటికి నోటీసులు ఇవ్వడమేంటి? అని పలువురు ప్రశ్నించారు. దీంతో తాజాగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు

ఇటీవల ఐఐటీ ఢిల్లీకి రూ.120 కోట్లు జీఎస్టీ చెల్లించాలంటూ విద్యాసంస్థకు షోకాజ్ నోటీసు పంపించింది. ప్రత్యుత్తరం సమర్పించేందుకు విద్యా సంస్థకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఐఐటీతో పాటు పలు ఇతర విద్యా సంస్థలకు కూడా గత వారం జీఎస్టీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రూ.5.4 కోట్ల జీఎస్టీ చెల్లించాలని తమిళనాడు అన్నా యూనివర్సిటీకి పంపించింది. ఇతర ప్రైవేట్ మరియు ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు కూడా అధికారులు GST నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో విద్యా మంత్రిత్వ శాఖ జోక్యం పుచ్చుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖతో మాట్లాడుతుంది. సమస్యను పరిష్కరించేందుకు చర్చలు నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏ మంత్రిత్వ శాఖ లేదా విద్యాసంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

ఇది కూడా చదవండి: Reliance Jio: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అత్యధిక డేటాతో టాప్ 3 ప్లాన్‌లు ఇవే..!