- అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న రిలయన్స్ జియో
-
అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటా -
రీఛార్జ్‌పై గరిష్ట రోజువారీ డేటాను అందిస్తున్న జియో -
అత్యధిక డేటాతో టాప్ 3 ప్లాన్‌లు ప్రవేశపెట్టిన జియో.

భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్‌పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో ఒకటి ఉచిత OTT సభ్యత్వాన్ని అందిస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 449
ఈ ప్లాన్ లో 3GB రోజువారీ డేటాను అందింస్తుంది. రూ. 449తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంతే కాకుండా.. అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMS అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు.. జియో యాప్‌లకు (JioTV, JioCinema మరియు JioCloud) యాక్సెస్ కూడా ఇస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 1199
రూ. 1,199 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఇది 84 రోజుల పాటు 3GB రోజువారీ డేటాను అందిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. అంతేకాకుండా.. ప్రతిరోజూ 100 SMS పంపవచ్చు. ఈ ప్లాన్ JioTV, JioCinema మరియు JioCloud వంటి Jio ఫ్యామిలీ యాప్‌లకు కూడా యాక్సెస్ ఇస్తుంది.
జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 1799
Reliance Jio యొక్క ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే.. వినియోగదారులు 84 రోజుల చెల్లుబాటుతో 3GB రోజువారీ డేటాను పొందుతారు. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, ప్రతిరోజూ 100 SMS అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. JioTV, JioCinema మరియు JioCloud వంటి యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. దీంతో పాటు.. నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.