- రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం
- ప్రసంగించిన రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ
- సుమారు 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం చేస్తానని ప్రకటన

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని.. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభమైంది. ఓ వైపు రిలయన్స్ వ్యాపారం యొక్క ప్రణాళికను ముఖేష్ అంబానీ పంచుకుంటూ ఉండగా.. అదే సమయంలో రిలయన్స్ (ఆర్‌ఐఎల్ షేర్) షేర్లు వేగంగా ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరి గంటలో కంపెనీ షేరు రూ.3074 స్థాయికి ఎగబాకింది. అయితే.. మార్కెట్ ముగిసే సమయానికి దాని వేగం మందగించింది. అయినప్పటికీ ఇది 1.55 శాతం పెరిగి రూ. 3042.90 వద్ద ముగిసింది. షేర్ల పెరుగుదల కారణంగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.20.58 లక్షల కోట్లకు పెరిగింది.
READ MORE: IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
కాగా.. ఛైర్మన్ అంబానీ ప్రసంగం అనంతరం రిలయన్స్ ఏజీఎంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగిన దేశం భారతదేశమని, ఇది దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు సహాయ పడుతుందన్నారు. అయితే వారికి సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మన చరిత్రను గౌరవిస్తూ.. వర్తమానాన్ని కాపాడుకుంటూ, భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నప్పుడే అభివృద్ధి చెందిన భారతదేశ కల నెరవేరుతుందని తెలిపారు.
READ MORE: IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సహాయం చేస్తామన్నారు. సుమారు 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం చేస్తానని ప్రకటించారు. గతేడాది ప్రారంభించిన స్వదేశ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది మన హృదయానికి దగ్గరగా ఉందని, దేశ సంస్కృతికి అనుసంధానమై ఉందన్నారు. స్వదేశ్ ద్వారా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను నెరవేర్చడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.