- స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
- బంగారం బాటలోనే వెండి
- నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold and Silver Price in Hyderabad: మగువలకు శుభవార్త. బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.100 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 30) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050లుగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,150లుగా నమోదైంది. కేంద్ర బడ్జెట్ 2024లో సుంకాన్ని తగ్గించడంతో భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. పెళ్లిళ్ల సీజన్ కావడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,050లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.67,200 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.73,180గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050గా.. 24 క్యారెట్ల ధర రూ.73,150గా కొనసాగుతోంది.
మరోవైపు గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర.. నేడు స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.88,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.88,400లుగా ఉండగా.. చెన్నైలో రూ.93,000లుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.87,500గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.93,000 వద్ద కొనసాగుతోంది.