Leading News Portal in Telugu

PM Modi On Global Fintech: ఫిన్‌టెక్‌ల కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది..


  • గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ..

  • ఫిన్‌టెక్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకుంది..

  • ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయటంలో ఫిన్‌టెక్‌ రంగం కీలక పాత్ర: ప్రధాని మోడీ
PM Modi On Global Fintech: ఫిన్‌టెక్‌ల కోసం కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది..

PM Modi On Global Fintech: ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2024’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్ అనేక విధానపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో ఒకటి ఏంజిల్‌ ట్యాక్స్‌ను రద్దు చేయడం వల్ల.. గత పదేళ్లలో ఈ రంగం 31 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ప్రజల్లో డిజిటల్‌ అక్షరాస్యతను పెంచటంతో పాటు సైబర్‌ నేరాలను అరికట్టే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని నియంత్రణ సంస్థలను ఆయన కోరారు. ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయటంలో ఫిన్‌టెక్‌ రంగం కీలక పాత్ర పోషించింది.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

అయితే, భారతీయులు ఫిన్‌టెక్‌ను అలవర్చుకున్న తీరు అసామాన్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇంత వేగంగా ప్రపంచంలో ఈ రంగం ఎక్కడా విస్తరించలేదు.. ఫిన్‌టెక్‌ ప్రభావం కేవలం టెక్నాలజీకి మాత్రమే పరిమితం కాలే.. సామాజికంగానూ పలు మార్పులు వచ్చాయి.. ఆర్థిక సేవల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్యనున్న అంతరాలు భారీగా తగ్గిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో పండగల సీజన్‌ వచ్చేసింది.. ఆర్థిక వ్యవస్థలోనూ అదే వాతావరణం కనబడుతుంది.. జీడీపీలో బలమైన వృద్ధి రేటు, క్యాపిటల్‌ మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరాయి.. అలాగే, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇప్పటి వరకు 27 లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసినట్లు నరేంద్ర మోడీ గుర్తు చేశారు.

కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయడంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ ఈరోజు నెంబర్ స్థానంలో ఉందని గుర్తు చేశారు. విధానపరమైన నిర్ణయాలతో పాటు సాంకేతికంగా వచ్చిన పురోగతే అందుకు సహాయ పడిందని వివరించారు. భారత ఫిన్‌టెక్‌ ప్రయాణంలో విధాన రూపకర్తలు, నియంత్రణ సంస్థలు, ఆవిష్కర్తల మధ్య సహకారం చాలా కీలకం..ఫిన్‌టెక్‌ రంగంలోని వ్యక్తులతో గత ఏడాదిగా పలు సంప్రదింపులు జరిపాం.. కలిసికట్టుగా ముందుకు వెళ్లడానికి తాము చేస్తున్న కృషికి ఇది ఉదహరణ అని శక్తికాంత్ దాస్ అన్నారు.