- డిజిటల్ చెల్లింపుల్లో పుట్టుకొస్తున్న కొత్త పద్ధతులు..
-
ఫేర్తింపు ఆధారంగా చెల్లింపులు చేసే అవకాశం.. -
స్మైల్ పే తరహా పేమెంట్ విధానానికి శ్రీకారం చుట్టిన ఫెడరల్ బ్యాంక్..

SmilePay: డిజిటల్ చెల్లింపుల్లో ఎప్పటికప్పుడు సరి కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేసేది.. కానీ, ఆ తర్వాత యూపీఐ లైట్ అంటూ పిన్‌తో పని లేకుండా పోయింది. కొత్తగా ట్యాప్ అండ్ పే అంటూ గ్యాడ్జెట్స్‌తో పేమెంట్ చేసే ఛాన్స్ కొన్ని సంస్థలు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా వస్తువులతో పని లేకుండా కేవలం ఫేస్ గుర్తింపు ఆధారంగా పేమెంట్ చేసే సదుపాయం వచ్చేస్తోంది. ఇకపై పేమెంట్స్ చేయాలంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు అన్నమాట.
ఇక, స్మైల్ పే అనే పేరుతో కొత్త తరహా పేమెంట్ విధానానికి ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారుల ఫేస్ రికగ్నైజేషన్‌తో ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అంటే స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్‌తో పనుండదు. కేవలం రెండు దశల్లోనే ఈ చెల్లింపులు పూర్తి చేయొచ్చు. యూఐడీఏఐకి చెందిన భీమ్ ఆధార్ పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీనే ఈ స్మైల్ పే..బ్యాంక్ మర్చంట్స్ తమ మొబైల్‌లో ఫెడ్ మర్చెంట్ అప్లికేషన్‌లోని పేమెంట్ ఆప్షన్లలో ఉండే స్మైల్ పే ఆప్షన్‌ను ఎంచుకొని ఈ సేవలు పొందొచ్చు. ఫెడ్ మర్చంట్లు కస్టమర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. ఆ తర్వాత మర్చంట్ మొబైల్ నుంచి కస్టమర్ ఫేస్ ను స్కాన్ చేస్తారు.. ఉడాయ్ లోని ఫేషియల్ డేటా ఆధారంగా బ్యాంక్ దాన్ని ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. వెరిఫై అయిన తర్వాత చెల్లింపులు పూర్తైనట్లు ఒక వాయిస్ అలర్ట్ వస్తుంది.. దీంతో పేమెంట్ గురించి వ్యాపారికి అప్‌డేట్ ఇస్తుంది.
అలాగే, ఒక్కో లావాదేవీకి రూ5,000 వరకు పరిమితి విధించింది. నెలకు కేవలం రూ.50వేల వరకు చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. అయితే, మర్చంట్ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డ్‌తో లింక్ అయి ఉండాలి.. ఈ సేవలతో అనేక లాభాలు ఉన్నాయి. కార్డు, క్యాష్, మొబైల్, డివైజెస్‌లకు లావాదేవీలకు కోసం వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.. కౌంటర్ దగ్గర ఎక్కువ సేపు నిలబడాల్సిన పని లేదు.. ఇది ఉదయ్ ఫేస్ అథెంటికేషన్ సర్వీస్ కాబట్టి భద్రత గురించి బాధ పడాల్సిన అవసం కూడా లేదు అని ఫెడరల్ బ్యాంక్ సీడీఓ ఇంద్రనీల్ పండిత్ అన్నారు.