- సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్
-
జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్.. నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మన మార్కె్ట్ మాత్రం శుక్రవారం ప్రదర్శించిన దూకుడునే సోమవారం చూపించింది. సోమవారం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 151 పాయింట్లు లాభపడి 84, 695 మార్కు క్రాస్ అయి రికార్డ్ సృష్టించింది. అలాగే నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 25, 875 దగ్గర ట్రేడ్ అవుతూ జీవితకాల గరిష్టాన్ని సొంతం చేసుకుంది. ఇక ముగింపులో సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84, 928 దగ్గర ముగియగా.. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25, 939 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.55 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: Bee Attack: తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
నిఫ్టీలో ఎమ్ అండ్ ఎమ్, ఒఎన్‌జీసీ, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్ లాభపడగా.. ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. సెక్టార్లలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. అయితే ఆటో, ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, మీడియా 0.5-1 శాతం పెరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.7 శాతం చొప్పున పెరిగాయి.
ఇది కూడా చదవండి: MP: ఆర్మీ ప్రత్యేక రైలును పేల్చివేసేందుకు కుట్ర?.. నిందితుడు రైల్వే ఉద్యోగి