Leading News Portal in Telugu

యాప్‌ కాదు బ్యాంక్‌

విదేశాల్లో నచ్చిన ప్రదేశానికి వెళ్లడమంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ప్రతి చోటా మన కార్డులు పనికార్డులు పని చేయవు. అందుకే మీ కోసమే ఈ ‘స్మార్ట్‌’ బ్యాంక్‌ ఉంది. కేవలం యాప్‌ ద్వారా మాత్రమే పనిచేసే ఈ బ్యాంక్‌ పర్యాటకులకు హాట్‌ ఫేవరేట్‌గా మారింది. అదే ‘మోంజో’ యాప్‌. దీనికి అదనంగా ప్రీ-పెయిడ్‌ కార్డ్‌. విదేశాలకు వెళ్లినప్పుడు మీ డబ్బును ఇందులో లోడ్‌ చేసుకుంటే చాలు.

ఎన్ని లావాదేవీలైనా చేసుకోవచ్చు. కేవలం యాప్‌ ద్వారా దీనికి సంబంధించిన లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా పనిచేస్తుంది. మీరు కార్డు ద్వారా ఎటువంటి లావాదేవీలు నిర్వహించినా అదనపు రుసుము వసూలు చేయదు. ఏ దేశమైనా సరే, ఎక్సేంజ్‌ రేట్‌ను మాత్రం పరిగణలోకి తీసుకోదు. అదే ఇందులోని ప్రత్యేకత. ఒక వేళ కార్డు పోయినా యాప్‌ ద్వారా లాక్‌ చేయచ్చు.