బాబా రాందేవ్‌కు షాక్.. ‘కింభో’ యమ డేంజర్!
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా యోగా గురు బాబా రాందేవ్ ‘కింభో’ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్వదేశీ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఇబ్బందుల్లో పడింది. అసలు ఈ యాప్‌కు ఎలాంటి భద్రత లేదని, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే యూజర్లు ఇబ్బందుల్లో పడినట్లే అని ఫ్రెంచ్ హ్యాకర్, టెక్నాలజీ రీసెర్చర్ ఎల్లాయిట్ అల్డెర్సన్ హెచ్చరించారు. అంతేకాకుండా ‘కింభో’ యాప్ పెద్ద డొల్ల అని ఆయన ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. ‘కింభో’ యాప్ నిన్న అందుబాటులోకి రాగా.. గురువారం అల్డెర్సన్ ట్విట్టర్ ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కింభో’ యాప్‌ను సెక్యూరిటీ డిజాస్టర్‌గా అభివర్ణించారు.
అల్డెర్సన్ గతంలోనూ ఆధార్ వంటి ప్రభుత్వ యాప్‌లలో బగ్స్ ఉన్నాయని హెచ్చరించారు. కాగా, ‘కింభో’ యాప్‌పై ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కింభో యాప్ పెద్ద జోక్. భవిష్యత్తులో ప్రెస్ స్టేట్‌మెంట్లు ఇచ్చే ముందు సమర్థవంతులైన డెవలపర్లను నియమించుకోండి. ఇప్పటి నుంచే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకండి’ అని అల్డెర్సన్ యూజర్లకు సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ లేదు.
This @KimbhoApp is a joke, next time before making press statements, hire competent developers… If it is not clear, for the moment don't install this app. #Kimbho #KimbhoApp pic.twitter.com/wLWzO6lhSR
— Elliot Alderson (@fs0c131y) May 30, 2018
యాప్‌లో బగ్స్ ఉన్నాయని, అస్సలు సెక్యూరిటీ లేదని తేలడంతో యాపిల్ స్టోర్ నుంచి కూడా తీసేసినట్లు సమాచారం. ఇదే కారణంతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించారు. ‘కింభో’కు విపరీతమైన ట్రాఫిక్ వచ్చిందని, దాన్ని తట్టుకోవడానికి సర్వర్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, అందుకే ప్రస్తుతం అందుబాటులో లేదని కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కానీ బగ్స్ ఉండటం వల్లే యాపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ‘కింభో’ యాప్ పెద్ద కాపీ క్యాట్ అని అల్డెర్సన్ అభివర్ణించారు. ‘బోలో’ అనే యాప్ నుంచి డాటా మొత్తం కాపీ కొట్టేసి ఈ ‘కింభో’ యాప్‌ను తయారుచేశారని స్క్రీన్ షాట్లతో సహా అల్డెర్సన్ ట్వీట్ చేశారు.
The @KimbhoApp is a copy paste of another #application. The description and the screenshots in the app stores are the same. Moreover, the #Kimbho app is making request to bolomessenger[.]com pic.twitter.com/gOKOhash5X
— Elliot Alderson (@fs0c131y) May 31, 2018
బాబా రాందేవ్ టీం కనీసం విలువలు పాటించకుండా ‘బోలో’ యాప్ నుంచి డిస్క్రిప్షన్, ఇమేజ్‌లు కాపీ కొట్టేయడం బాధాకరం. మొత్తం మీద ఈ యాప్ ఏ విధంగాను మీ స్మార్ట్‌ఫోన్‌కు మంచిది కాదని అల్డెర్సన్‌తో పాటు పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ‘కింభో’ అనేది సంస్కృత పదమని, కింభో అంటే ‘ఎలా ఉన్నారు?’ లేదా ‘ఏంటిది కొత్తగా?’ అనే అర్థాలు వస్తాయని పతాంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారవాలా చెప్పారు.