మే నెల టాప్ సెల్లింగ్ కార్ మారుతి ఆల్టో
గత నెల కార్ల విక్రయాల్లో మారుతి హవా
మారుతీ సుజుకీ సంస్థ మరోసారి సత్తా చాటింది. మే నెలలో దేశీయ ప్రయాణికుల వాహనాల (పీవీ) విభాగంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్-10 కార్లలో ఈ సంస్థకు చెందినవే ఏడు ఉండటం విశేషం. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) విడుదల చేసిన సమాచారం ఆధారంగా మారుతీ ఆల్టో కారు జాబితాలో అగ్రస్థానం దక్కించుకొంది.
మే నెలలో మారుతీ సంస్థ 21,890 ఆల్టో వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే(మే) నెలలో విక్రయించిన 23,618 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా మొత్తం ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలోనే కొనసాగింది. 19,398 యూనిట్ల అమ్మకాలతో బాలెనో మూడో స్థానంలో, 19,208 అమ్మకాలతో స్విఫ్ట్ నాలుగో స్థానంలో, 15,974 కార్ల అమ్మకాలతో వ్యాగన్ ఆర్ 5వ స్థానంలో ఉన్నాయి. 15,629 యూనిట్ల విక్రయాలతో వితారా బ్రెజా ఆరో స్థానంలో, హ్యుందాయ్ క్రెటా 11,004 వాహనాల విక్రయాలతో ఏడో స్థానంలో నిలిచాయి. మారుతికే చెందిన గ్రాండ్ ఐ10 ఎనిమిదో స్థానం దక్కించుకొంది. ఎలైట్ ఐ 20 తొమ్మిదో స్థానంలో ఉంది. మళ్లీ పదో స్థానంలో మారుతి సెలెరియా నిలిచింది. మే నెలలో సెలేరియో 10,160 యూనిట్లను అమ్మగలిగింది.