పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే..
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటి ధరలు తగ్గుతాయని, జీఎస్టీ పరిధిలోకి తేవాల్సిందేనని గత కొన్ని రోజుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే..వాటి ధరలు ఎలా ఉంటాయనే దానిపై కేంద్రం బుధవారం (జూన్ 20) స్పష్టత నిచ్చింది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకొచ్చినప్పటి అవి పూర్తిస్థాయి జీఎస్టీ పరిధిలోకి రావని, 28శాతం జీఎస్టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలున్నాయని, అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే టాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
లీటర్ పెట్రోల్ పై ప్రస్తుతం కేంద్రం రూ. 19.48, లీటర్ డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. దీంతో పాటు రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా విధిస్తున్నాయి. డీజిల్‌పై తెలంగాణలో అధికంగా 26 శాతం వ్యాట్ విధిస్తుండగా, పెట్రోల్‌పై ముంబయిలో అత్యధికంగా 39.12 శాతం వ్యాట్ని విధిస్తున్నారు. ఇక అండమాన్‌లో తక్కువగా 6 శాతం వ్యాట్ ఉంది.
మొత్తం పన్నులు కలిపి పెట్రోల్ పై 45 నుంచి 50 శాతం వరకూ, డీజిల్‌పై 35 నుంచి 40 శాతం వరకూ ఉన్నాయి. వీటిని జీఎస్టీలోకి తీసుకొచ్చినప్పటికీ ధరల విషయంలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రస్తుతమున్న ధరలే ఉంటాయని కేంద్రం తెలిపింది.