EPF balance: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కించేది ఇలాగే
మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? ప్రతీ నెల మీ జీతం నుంచి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? దానిపై మీరు ప్రతీ ఏటా వడ్డీ పొందొచ్చు. మీ జీతంలో 12 శాతం ఉద్యోగి వాటా, 12 శాతం యజమాని వాటా ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. ఎంప్లాయర్స్ వాటాలో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్-EPS అకౌంట్‌లోకి వెళ్తుంది. మిగతాది ఈపీఎఫ్ అకౌంట్లోకి వెళ్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5% అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో ఉన్న వడ్డీ రేటును తగ్గించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును ప్రతీ నెల లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివర్లో అకౌంట్‌లో జమ చేస్తారు. ఇతర ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రిటైర్మెంట్ సొల్యూషన్స్ లాగానే ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎక్కువ. పీపీఎఫ్ లాగా సావరిన్ గ్యారెంటీ ఉంటుంది. మరి ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి.
మీ బేసిక్ వేతనం, అలవెన్సులు కలిపి రూ.20,000 అనుకుందాం. మీరు 2014 సెప్టెంబర్ తర్వాత మీ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ రూ.2,400, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ రూ.2,400. మొత్తం రూ.4,800. అదే మీరు 2014 సెప్టెంబర్ కన్నా ముందు ఈపీఎఫ్ఓ మెంబర్ అయితే ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ 8.33% అంటే రూ.1,150, మీ కంట్రిబ్యూషన్ రూ.2,400. మొత్తం రూ.3,550. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5% వడ్డీ రేటు కాబట్టి 12 నెలలకు భాగించాలి. అంటే 8.50%/12 = 0.7083% వడ్డీ నెలకు అవుతుంది. మీరు ఏప్రిల్‌లో ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రారంభిస్తారు కాబట్టి రూ.3,550 కి ఎంత వడ్డీ వస్తుందో లెక్కించాలి. నెలాఖరులో సాలరీ క్రెడిట్ అవుతుంది కాబట్టి అప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ రూ.3,350 ఉంటుంది. మేలో మరోసారి ఈపీఎఫ్ అకౌంట్‌లో రూ.3,350 జమ అవుతుంది. అంటే మొత్తం రూ.7,100. మే మాసానికి మీ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌కు వచ్చే వడ్డీరూ.7,100 x 0.7083%= రూ.50. ఇలాగే ప్రతీ నెలకు వడ్డీ లెక్కించాల్సి ఉంటుంది.