Leading News Portal in Telugu

Hyderabad: మహిళ వ్యాపారి ఘరానా మోసం.. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలకు టోకరా.. బాధితుల గగ్గోలు – Telugu News | Woman cheats 7 crore rupees in name of chittis Shadnagar Telugu News


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మరో చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. పైసా పైసా కూడబెట్టి.. చిట్టీలు కట్టి మోసపోయారు కొందరు అమాయకులు. షాద్‌నగర్‌కు చెందిన వసంత అనే మహిళ గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతోంది. ఆ నమ్మకంతోనే.. వందల మంది.. లక్ష నుంచి 5లక్షల వరకూ చిట్టీలు కట్టారు. అయితే.. ఏడు కోట్ల వరకు చిట్టీలు బకాయి ఉండడగా.. ఆ మహిళ గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మరో చిట్టీ మోసం వెలుగులోకి వచ్చింది. పైసా పైసా కూడబెట్టి.. చిట్టీలు కట్టి మోసపోయారు కొందరు అమాయకులు. షాద్‌నగర్‌కు చెందిన వసంత అనే మహిళ గత 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతోంది. ఆ నమ్మకంతోనే.. వందల మంది.. లక్ష నుంచి 5లక్షల వరకూ చిట్టీలు కట్టారు. అయితే.. ఏడు కోట్ల వరకు చిట్టీలు బకాయి ఉండడగా.. ఆ మహిళ గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో మోసపోయిననట్లు గుర్తించారు బాధితులు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో లబోదిబోమంటున్నారు. మొదట్లో కొద్దిమందే ఉన్నప్పటికీ.. ఆమె పరారైన విషయం మరికొందరికి తెలియడంతో బాధితుల సంఖ్య పెరిగింది. దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు ఏడు కోట్ల వరకు మోసం చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో డబ్బులు పోయినట్టేనని ఆందోళన చెందుతున్నారు. అయితే.. చిట్టీల వ్యాపారం నడుపుతున్న మహిళ భర్త ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. అతను కూడా కనిపించకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చిట్టీల పేరుతో మోసం చేసిన వసంత, ఆమె భర్త కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఇక.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రైవేట్‌ చిట్టీల వ్యాపారాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా ప్రైవేట్ చిట్టీలు నడపడం, ప్రైవేటు ఫైనాన్స్ చేయడం.. నేరమైనప్పటికీ.. అవేమీ పట్టించుకోని కొందరు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. చిట్టీ మోసాలకు పాల్పడుతున్నవారిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు బాధితులు. మొత్తంగా.. ప్రైవేట్‌ చిట్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా జనం పట్టించుకోకుండా మోసపోతూనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి