Leading News Portal in Telugu

Vijayawada: ఉమ్మడి కృష్టా జిల్లాలో విచిత్ర దొంగతనం.. పోలిసులకు ఫిర్యాదు చేసిన రైతు.. – Telugu News | Farmer Files Police Complaint as Marigold Plants been stolen in Krishna District


Vijayawada; నిత్యం మనం ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. తాళం వేసిన ఇళ్లను దోచుకునే వారు కొందరైతే.. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు మరి కొందరు. ఇక బ్యాంకు రోబరి చేసేవారు ఇంకొందరు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సర్వసాధారణ ఘటనలు ఉన్నాయి.. కానీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓ విచిత్ర దొంగతనం జరిగిందే. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 8: నిత్యం మనం ఎన్నో దొంగతనాల గురించి వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం. తాళం వేసిన ఇళ్లను దోచుకునే వారు కొందరైతే.. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు మరి కొందరు. ఇక బ్యాంకు రోబరి చేసేవారు ఇంకొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సర్వసాధారణ ఘటనలు ఉన్నాయి.. కానీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓ విచిత్ర దొంగతనం జరిగింది. ఇంతకీ అక్కడ దొంగలు ఏం దొంగిలించారంటే.. ఇలాంటి దొంగతనం గురించి మీరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండరు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో ఈ వింత దొంగతనం జరిగింది. ఈ వింత దొంగతనం చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అసలు ఈ వింత దొంగతనం వివరాలు ఇవే..

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శంకర్ అనే బంతి పూల రైతు గత మూడు సంవత్సరాల నుంచి బంతి పువ్వుల తోట వేశాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలో లాభాలు వస్తుండడంతో ఈ సంవత్సరం కూడా రెండు ఎకరాల పంట భూమిని కౌలుకు తీసుకొని మరీ రెండు లక్షల రూపాయల పెట్టుబడితో నెల రోజుల క్రితం పంట వేశాడు. రాబోయే పదిహేను రోజుల్లోనే దాని పంట చేతికి రానుంది. ఇంతలో ఆ రైతులకు షాక్ ఎదురయ్యింది. రాత్రికి రాత్రే బంతి పూల తోటలో కొన్ని మొక్కల చోరీ జరిగింది. బంతి మొక్కలు చోరీకి గురైనట్లు గ్రహించిన రైతు శంకర్ ఇంట్లో నాటుకోవడానికి పెంచుకోవడానికి తీసుకువెళ్లారులే అని వదిలేశాడు. అదే అదునుగా తీసుకొని దొంగలు బుధవారం రాత్రి సమయంలో సుమారు వంద నుంచి 150 మొక్కల వరకు చోరీ చేయడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.

తన వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని రహదారికి సమీపంలోనే అతి దగ్గరలోనే పంట భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటే ఇలా దుండగులు మొక్కల చోరీ చేయటంపై ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు శంకర్ తెలిపాడు. దొంగలు ఆఖరికి రైతు పండించే పంటను కూడా వదలకపోవటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే శంకర్ లాభాలను చూసి తట్టుకోలేనివారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు. మరోవైపు శంకర్ చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..