Leading News Portal in Telugu

Visakhapatnam: పాపం తల్లీ పిల్లలు..! ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఆ అనుమానం నెపమే ఉసురు తీసిందా..!? – Telugu News | Mother dies along with her two children in Visakhapatnam


Visakhapatnam: వాళ్లది ఓ పేద కుటుంబం..! అయినా సరే కష్టపడి కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం పిల్లలతో సహా బొబ్బిలి నుంచి విశాఖకు వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్‌గా చేరి అక్కడే ఆ కుటుంబం ఉంటుంది. భర్త తాపీ మేస్త్రి పనులకు కూడా వెళ్తున్నాడు. ఏమైందో ఏమో కానీ.. తల్లి ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడ్డారు. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన చూసిన వాళ్ళందరిని తీవ్రంగా కలచి వేస్తోంది. అసలేం జరిగిందంటే…

Visakhapatnam: పాపం తల్లీ పిల్లలు..! ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఆ అనుమానం నెపమే ఉసురు తీసిందా..!?

Police Enquiring Sandhya’s Husband Lakshman

విశాఖపట్నం, ఆగస్టు 9: వాళ్లది ఓ పేద కుటుంబం..! అయినా సరే కష్టపడి కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. బతుకుదెరువు కోసం పిల్లలతో సహా బొబ్బిలి నుంచి విశాఖకు వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్‌గా చేరి అక్కడే ఆ కుటుంబం ఉంటుంది. భర్త తాపీ మేస్త్రి పనులకు కూడా వెళ్తున్నాడు. ఏమైందో ఏమో కానీ.. తల్లి ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడ్డారు. ముగ్గురు విగత జీవులుగా మారారు. ఈ ఘటన చూసిన వాళ్ళందరిని తీవ్రంగా కలచి వేస్తోంది. అసలేం జరిగిందంటే.. విశాఖలో ఇద్దరు పిల్లలు సహా తల్లి అనుమానాస్పదంగా మృతి చెండారు. అపార్టుమెంట్ నీటి సంపులో తల్లి పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్‌లో వాచ్మెన్‌గా పనిచేస్తుంది కుటుంబం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలికి చెందిన లక్ష్మణ్.. భార్య సంధ్య, ఇద్దరు పిల్లలతో బతుకుతెరువు కోసం విశాఖ వచ్చేశాడు. మర్రిపాలెం వుడా లేఔట్‌లోని ప్రకాష్ రెసిడెన్సిలో వాచ్మెన్ పనికి చేరింది ఆ కుటుంబం. అక్కడే సెల్లార్లో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ్ సంధ్య దంపతులకు ఇద్దరు పిల్లలు.. 9 ఏళ్ల గౌతమ్, ఐదేళ్ల అలేఖ్య ఉన్నారు. ఎప్పటిలాగానే గత రాత్రి అంతా కలిసి భోజనం చేశారు. ఇంట్లోనే పడుకున్నారు. ఏమైందో ఏమో కానీ.. ఉదయాన్నే చూసేసరికి తల్లి సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్య విగత జీవులుగా మారారు. మృతదేహాలు అపార్ట్మెంట్ సెల్లార్‌లోని నీటి సంపులో కనిపించాయి.

బలవన్మరణమేనా..?!

సమాచారం అందుకున్న ఏర్పోర్ట్ పిఎస్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలు మార్చురీకి తరలించారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు ఎయిర్ పోర్టు పిఎస్ పోలీసులు. భర్త లక్ష్మణ్ తాపీ మేస్త్రిని విచారించిన ఏసీపి నరసింహమూర్తి ఘటన స్థలాన్ని భర్త, బంధువుల నుంచి వివరాలు సేకరించారు.

ఇవి కూడా చదవండి

బంధువుల ఆరోపణ..

అయితే సంధ్యకు వివాహేతర సంబంధం నెపంతో పెద్దమ్మ నుంచి వేధింపులు మొదలయ్యాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పటికీ.. ఆమెను తరచూ మానసికంగా బంధువులు వేధించేవారంట. అందుకే బొబ్బిలి నుంచి విశాఖ వచ్చేసారని.. అయినప్పటికీ తరచూ సంధ్యను పెద్దమ్మ.. అక్రమ సంబంధం నెపం పెట్టి వేధిస్తుండడంతోనే మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యం చేసుకొని ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. అయితే అనరాని మాటలు అనడంతోనే సంధ్య మనస్తాపంతో పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిందా..? మరే ఇతర కారణమైన ఉందా..? అన్నది తేలాల్సి ఉంది. తాను లేకపోతే ఇక ఆ ఇద్దరు పిల్లలు ఏమవుతారనే బెంగ, ఆందోళన ఏమోగానీ.. పిల్లలు కూడా తల్లితో పాటు విగత జీవులుగా మారారు.