కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కమలాపురం: వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం కె కొత్తపల్లెలో విషాదంచోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో కర్నాటి ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. కొత్త భవనానికి పైపుతో నీళ్లు పడుతుండగా ఈశ్వర్‌రెడ్డి ఒక్కసారికి కుప్పకూలిపోయాడు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈశ్వర్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.