మేనల్లుడితో అత్త రాసలీలలు…బెడ్రూంలో శృంగారంలో మునిగితేలుతుంటే సడెన్ గా….
మేనమామ భార్య అనే సంగతి మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని, తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని మేనమామను దారుణంగా హత్య చేశాడో మేనల్లుడు. బీహార్ కు చెందిన చంపారన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్వేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య గీతతో కలిసి జీవితం కొనసాగిస్తున్నాడు. చదువుకునేందుకు వచ్చిన సర్వేష్ మేనల్లుడు విజయ్ వారితోనే నివాసముంటున్నాడు. అయితే అత్త గీతతో పరిచయం పెంచుకున్నాడు. అయితే విజయ్ హద్దు దాటి ప్రవర్తిస్తున్నా, గీత వారించేది కాదు. పైగా అతడితో వివాహేతర బంధానికి సై అన్నది, అంతే కాదు ఇద్దరూ వావివరసలు మరిచి శృంగారంలో మునిగి తేలేవారు. ఫలితంగా సర్వేష్ కు అసలు సంగతి తెలిసింది. ఇద్దరినీ నిలదీశాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సర్వేష్ ను హత్య చేయాలని గీత, విజయ్‌లు కుట్ర పన్నారు. ప్లాన్‌లో విజయ్, గీతలు సర్వేష్ ను కత్తితో పొడిచి హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని బెడ్ షీట్‌లో చుట్టి బస్తాలో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా రైలు పట్టాలపై పడేశారు. సర్వేష్ సోదరుడు ఫిర్యాదు చేయగా, గీతపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో డాగ్ స్వ్వాడ్ ద్వారా ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా గీతపైనే పోలీసుల అనుమానం బలపడింది. గీతను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని మేనల్లుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు సంగీత అంగీకరించింది. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.