రోడ్లపై ఉమ్మి వేసినందుకు నలుగురిపై కేసు నమోదు…
రాష్ట్రాల్లో ఇప్పుడు రోడ్లపై ఉమ్మి వేస్తే… చట్టరీత్యా నేరం అనీ, కేసులు నమోదవుతాయని ఎంతమందికి తెలుసు. రెగ్యులర్‌గా వార్తలు చూసేవారికీ, చదివేవారికి మాత్రమే ఇలాంటి విషయాలు తెలుస్తున్నాయి. ఫలితంగా అమాయకులు అడ్డంగా బుక్కైపోతున్నారు. తాజాగా… గత రెండ్రోజుల్లో హైదరాబాద్.. రాచకొండ పోలీసులు… నలుగురు వ్యక్తులపై కేసులు రాశారు. ఆ నలుగురూ రోడ్లపై ఉమ్మి వేశారు. వారిలో ఇద్దరు చౌటుప్పల్‌లోని మల్కాపురం గ్రామస్థులు. అబ్దుల్లాూర్‌మెట్ దగ్గర ఉమ్మి వేస్తుండగా… అది చూసిన పోలీసులు… తమ వృత్తి ధర్మం ప్రకారం… కేసులు రాశారు.
ఇలాగే చంపాపేట చెక్‌పోస్ట్ దగ్గర జరిగింది. ఓల్డ్ సంతోష్‌నగర్‌కి చెందిన ఓ వ్యక్తి… సరూర్‌నగర్‌లోని పీ అండ్ టి కాలనీలో రోడ్డుపై ఉమ్మి వేసి బుక్కయ్యారు. ఇలా నలుగురిని కనిపెట్టామన్న పోలీసులు… వారిపై ఐపీసీ సెక్షన్ 188, సెక్షన్ 269 ప్రకారం కేసులు రాసినట్లు తెలిపారు. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఉమ్మి కేసులు ఏంటని కొందరు అనుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రబలడానికి లాలాజలం కూడా కారణం అని పరిశోధనలు తేల్చాయి. ఐతే… దేశంతోపాటూ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ప్రజలు… పొగాకు, పాన్ వంటివి తిని… బాగా నమిలి… ఎక్కువగా లాలాజలం ఊరిన తర్వాత… ఉమ్మి రూపంలో దాన్ని రోడ్లపై, గోడలపై వేస్తున్నారు. ఐతే… ఇలా వేసేటప్పుడు… కొన్ని తుంపర్లు… గాల్లో ప్రయాణిస్తూ… అటుగా వెళ్లే వ్యక్తులపైనా పడుతున్నాయని పరిశోధనల్లో తేలింది. అలా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం (ఉమ్మి వేసే వారికి కరోనా ఉండి ఉంటే) ఉండటంతో… కేంద్ర ప్రభుత్వమే… ఇలాంటి యాక్షన్ తీసుకోమని రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు పాటిస్తున్నాయి.