Leading News Portal in Telugu

మాస్క్ ధరించని కొడుకును చంపేసిన తండ్రి…

పెట్టుకోలేదని ఎక్కడైనా తండ్రి… కొడుకును చంపడం విన్నామా… ఈ విషాద ఘటన బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం… తమ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. అక్కడే కాదు దేశం మొత్తం ఈ రూల్ ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఉంది. ఐతే… 78 ఏళ్ల ఆ తండ్రి… 45 ఏళ్ల కొడుకును పీక పిసికి చంపేశాడు. సాయంత్రం వేళ ఇంట్లోంచీ బయటకు వెళ్తున్నప్పుడు “అరేయ్… మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయావ్” అని తండ్రి గుర్తుచేస్తే… “తెలుసు… కావాలనే పెట్టుకోలా… అవసరం లేదులే” అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ… బయటకు వెళ్లబోయాడు కొడుకు.

అంతే… తండ్రి బన్షీధార్… తన కొడుకైన శీర్షేందు మల్లిక్‌పై మండిపపడ్డారు. “ముసలోణ్నైన నేనే బయటకు వెళ్తే… తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుంటున్నా… దివ్యాంగుడివైన నువ్వు పెట్టుకోకపోతే ఎలా… నీకు బాగా బలిసింది”… అని మందలించాడు.

“ఇదిగో నాన్నో… ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. కరోనా లేదు గిరోనా లేదు… ఈ మాస్కులూ అవీ మనకెక్కడ సెట్టవుతాయ్… అలా తిరిగొస్తా… ఇంట్లో బోర్ కొడుతోంది” అన్నాడు కొడుకు. రిటైర్డ్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయిన ఆ తండ్రి… “ఉద్యోగం, సద్యోగం లేకుండా పనికిమాలిన వాడిలా తిరుగుతున్నావ్… పైగా మాస్క్ పెట్టుకోనంటావేం… నీ ఒక్కడికి కరోనా వస్తే… ఇంటిల్లిపాదికీ వస్తుంది. చుట్టుపక్కల వాళ్లకీ వస్తుంది. వీధిలో వాళ్లకీ వస్తుంది. ఊరందరికీ వస్తుంది” అని తండ్రి ఫైర్ అయ్యాడు.