Leading News Portal in Telugu

షాకింగ్: కరోనా క్వారంటైన్ సెంటర్‌లో యువతిపై అత్యాచారం…అక్కడ వదలని మృగాళ్లు…

రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై దుండగులు లైంగిక దాడికి దిగారు. వివరాల్లోకి వెళితే సవాయ్ మాధోపూర్ బటోడా పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ నిర్వహించారు. ఫలితాలు వచ్చే వరకూ ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. అందులో భాగంగా గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రంలో ఉండేలా యువతికి ఏర్పాట్లు చేశారు. అయితే గత వారం యువతి అర్థరాత్రి సమయంలో నిద్రిస్తుండగా, ముగ్గురు యువకులు లోనికి ప్రవేశించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎవరూ లేకపోవడంతో ఆమె ఆర్తనాదాలు అరణ్యరోదనలు అయ్యాయి. అనంతరం వైద్య సిబ్బందికి ఈ విషయం తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.