లాక్‌డౌన్‌లో గొడవ… తండ్రిని చంపిన కొడుకు…
కరోనాను కంట్రోల్ చేసేందుకు విధించిన లాక్‌డౌన్… చాలా మంది పేదల బతుకుల్ని తెల్లారేలా చేస్తోంది. అది ముంబైలోని… సుభాష్ నగర్‌లో ఉన్న మాధా కాలనీ. 34 ఏళ్ల సచిన్… ఏ పనీ చెయ్యకుండా… ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. దాదాపు నెల నుంచి అలాగే ఉన్న కొడుకును చూసి… 70 ఏళ్ల కృష్ణ గోరివాలే… ఫైర్ అయ్యాడు. ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చోకపోతే… ఏదైనా పని చెయ్యొచ్చుగా… అన్నాడు. “అబ్బా నాన్నా… రోజూ అలా నసపెట్టకు. పని దొరికితే చెయ్యనా… ఇంట్లోనే కూర్చోవడానికి నాకేమైనా సరదానా… లాక్‌డౌన్ కదా… అర్థం చేసుకోవేం” అని రివర్సయ్యాడు.
నిజానికి సచిన్… లాక్‌డౌన్ ముందు వరకూ రకరకాల పనులు చేస్తూ… ఎంతో కొంత సంపాదిస్తూ… తండ్రిని, చెల్లెలినీ పోషిస్తున్నాడు. లాక్‌డౌన్ రావడం, అదీ కాక… ముంబైలో కరోనా చాలా ఎక్కువగా ఉండటంతో… అన్ని రకాల పనులూ మూతపడ్డాయి. దాంతో… పేద, మధ్య తరగతి కుటుంబాలు డబ్బు కోసం జేబులు తడుముకుంటున్నాయి.
70 ఏళ్ల ముసలాయన… ఒకప్పుడు ఆస్పత్రిలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కొడుక్కి పని లేకపోవడంతో… కుటుంబం కోసం మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లి ఏదో పని వెతుక్కొని రోజూ చేసి వస్తున్నాడు. ముసలోణ్నైన నేనే పనికి వెళ్తున్నప్పుడు… అన్నీ బాగున్న నా కొడుకు ఎందుకు పని చెయ్యడు అన్నది ఆ పెద్దాయన ఫీలింగ్. అందుకే అప్పుడప్పుడూ కొడుకును నాలుగు మాటలు అంటున్నాడు. కనీసం అలా తిడితేనైనా కొడుకు ఏదో ఒక పని వెతుక్కుంటాడన్నది ఆయన ఆలోచన.
ఇలా రోజులు గడుస్తున్నాయి. శుక్రవారం మరోసారి తండ్రీ, కొడుకు మధ్య గొడవ జరిగింది. అప్పటికే బయట ఎండలో తిరిగి తిరిగి పని దొరక్క ఇంటికొచ్చిన సచిన్‌ను తండ్రి తిట్టేసరికి తట్టుకోలేకపోయాడు. అప్పుడే మంచం నుంచి లేచి… మంచి నీళ్లు తాగేందుకు వెళ్తున్న ముసలాయన్ని వెనక నుంచి కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే… పెద్దాయన ఒక్కసారిగా కింద పడ్డాడు. అదే సమయంలో… సచిన్ కంటికి ఓ దుడ్డుకర్ర కనిపించింది. ఆవేశంలో ముందూ వెనకా ఆలోచించకుండా… ఆ కర్రను తీసుకొని… తండ్రి తలపై టపేల్ మని ఒక్కటిచ్చాడు. ఐతే… ఆ సమయంలో… ముసలాయన ఆ దెబ్బల్ని తట్టుకున్నాడు. ఓపిక లేకపోవడంతో… కొడుకుపై రివర్స్ అవ్వలేక… మౌనంగా రోధించాడు.