Tollywood: మరోసారి తెరపైకి టికెట్ ప్రైస్.. మేకర్స్ మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..? – Telugu News | Will movie ticket prices rise again
టికెట్ ప్రైస్ గురించి మరోసారి చర్చ మొదలైంది. భోళా శంకర్‌కు నో హైక్ అంటున్నారు మేకర్స్. అంటే మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..? ఇకపై రేట్లు పెంచడాలుండవా..? ట్రిపుల్ ఆర్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ మొదలైంది. అప్పటి వరకు ఎంత బడ్జెట్‌తో తీసినా.. ఎలాంటి పరిస్థితులున్నా ఉన్న టికెట్ రేట్లకు సినిమా చూపించాల్సిందే.
హీరోలు మారిపోతున్నారా లేదంటే నిర్మాతలు వద్దనుకుంటున్నారా.. అదీ కాదంటే ఆడియన్స్ ఇచ్చిన షాక్‌తో వెనకడుగు వేస్తున్నారా..? అసలు దేని గురించి ఈ టాపిక్ అనుకుంటున్నారు కదా.. టికెట్ ప్రైస్ గురించి మరోసారి చర్చ మొదలైంది. భోళా శంకర్‌కు నో హైక్ అంటున్నారు మేకర్స్. అంటే మళ్లీ పాత పద్దతిలోకి వెళ్తున్నారా..? ఇకపై రేట్లు పెంచడాలుండవా..? ట్రిపుల్ ఆర్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ మొదలైంది. అప్పటి వరకు ఎంత బడ్జెట్‌తో తీసినా.. ఎలాంటి పరిస్థితులున్నా ఉన్న టికెట్ రేట్లకు సినిమా చూపించాల్సిందే. కానీ బడ్జెట్ బాధలు ప్రభుత్వం దగ్గర విన్నవించుకోవడంతో.. నిర్మాతలకు వరం ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే ఇది కొన్ని సినిమాలకు వర్కవుట్ అయినా.. మరికొన్నింటికి భస్మాసుర అస్త్రం అయింది.
టికెట్ రేట్లు పెంచిన తర్వాత స్టార్ హీరోల సినిమాలు సైతం మార్నింగ్ షోస్ ఫుల్ కాలేదు. ఒకప్పుడు మార్నింగ్ షో టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు రేట్ల తాకిడికి కౌంటర్‌లో వాళ్లే పిలిచి మరీ ఇస్తున్నారు. అంటే స్టార్ హీరోల క్రేజ్ తగ్గిందా లేదంటే పెరిగిన టికెట్ రేట్లతో కామన్ ఆడియన్ సినిమాలకు దూరం అవుతున్నాడా..? ఆల్రెడీ 295 ఉన్న టికెట్.. పెరిగాక 350 అవుతుంది తెలంగాణలో.. ఏపీలో అయితే 220 రూపాయల పైమాటే.
టికెట్ రేట్లు పెరిగాక భారీ కలెక్షన్స్ రావడం మాట దేవుడెరుగు.. కనీసం మొదటి రోజు థియేటర్లకు జనం రావడానికి భయపడుతున్నారనే విమర్శలు వచ్చాయి. పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే కిల్ చేస్తున్నాయా అనేది అర్థం కాలేదు. అందుకే మన నిర్మాతలు కూడా రియలైజ్ అయి రియాలిటీలోకి వచ్చేస్తున్నారు.. పెద్ద సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు ఈ మధ్య.