Leading News Portal in Telugu

Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంతా ‘ఖుషి’.. గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. లైవ్ వీడియో.. – Telugu News | Vijay Devarakonda, Samantha Kushi Movie Trailer Launch Live Event


Kushi Movie Trailer Launch: ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ కూడా మొదలుపెట్టెసింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లతో పాటు ఇటీవల రిలీజైన ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలకు మంచి స్పందన రావడమే కాకుండా.. యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ రాబట్టాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది.

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన గత చిత్రాలయిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’ మాదిరిగానే.. ఈ ‘ఖుషీ’ చిత్రాన్ని కూడా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించాడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని.. విడుదలకు సిద్దమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ కూడా మొదలుపెట్టెసింది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లతో పాటు ఇటీవల రిలీజైన ‘ఆరాధ్య’, ‘నా రోజా నువ్వే’ పాటలకు మంచి స్పందన రావడమే కాకుండా.. యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ రాబట్టాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఇక ఆ ఈవెంట్‌ను మీరు కింద లైవ్ వీడియోలో చూసేయండి.



ఖుషీ ట్రైలర్ సెన్సార్ పూర్తి..

విజయ్, సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘ఖుషీ’ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. సీబీఎఫ్‌సీ బోర్డు ఈ సినిమా ట్రైలర్‌కు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. సుమారు 2 నిమిషాల 41 సెకన్ల నిడివి ఉండే ఈ ట్రైలర్‌కు సంబంధించి అప్‌డేట్‌ను హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌తో కథాంశం..

ఈ సినిమా కథాంశం కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌ చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా రెండు నెలల ముందుగానే రిలీజ్ కావాల్సి ఉండగా.. హీరోయిన్ సమంతా మయోసైటిస్ బారినపడటం.. దీంతో ఆమె పార్ట్ షూటింగ్ ఆలస్యం కావడం జరిగింది. ఈ సినిమా పోస్ట్‌పోన్‌కు ఇదే కారణమైంది. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అలాగే సమంతా ఈ సినిమా షూటింగ్ అనంతరం.. మయోసైటిస్ వ్యాధికి చికిత్స చేయించుకునేందుకు లాంగ్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.