Leading News Portal in Telugu

Bhola Shankar Movie: వివాదంలో ఇరుక్కున్న భోళా శంకర్ సినిమా.. వారు మోసం చేశారంటూ ఆరోపణలు – Telugu News | Bhola Shankar Movie Stuck in Controversy


చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై వివాదం రాజుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర తో పాటు గరికపాటి కృష్ణ కిషోర్ తమను నమ్మించి మోసం చేశారని డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రి దేవి ఫిలిమ్స్ సంస్థ ఆరోపిస్తుంది. అయితే ప్రత్యక్షంగా భోళాశంకర్ సినిమాతో ఎటువంటి వివాదం లేనప్పటికీ ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ఆరోపణల వ్యక్తం అవుతున్నాయి.

చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై వివాదం రాజుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర తో పాటు గరికపాటి కృష్ణ కిషోర్ తమను నమ్మించి మోసం చేశారని డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రి దేవి ఫిలిమ్స్ సంస్థ ఆరోపిస్తుంది. అయితే ప్రత్యక్షంగా భోళాశంకర్ సినిమాతో ఎటువంటి వివాదం లేనప్పటికీ ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ఆరోపణల వ్యక్తం అవుతున్నాయి. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ కు చెందిన అనిల్ సుంకరతోపాటు గరికపాటి కృష్ణ కిషోర్ తనని మోసం చేశారని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సతీష్ వాదన.

ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు గాయత్రీ దేవి ఫిలిమ్స్ కు రైట్స్ అందజేస్తామని అగ్రిమెంట్ రాసి 30 కోట్లు తీసుకున్నారని గాయత్రి ఫిలిమ్స్ ఆరోపిస్తున్నారు. ఐదు సంవత్సరాల పాటు హక్కులు ఉన్నప్పటికీ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే తమకు హక్కులు అందజేశారని అగ్రిమెంట్కు ఏకే ఎంటర్టైన్మెంట్స్ తూట్లు పొడిచారని గాయత్రి ఫిలిమ్స్ ఆరోపిస్తుంది. దీంతో తాము చెల్లించిన 30 కోట్లు వెనక్కి ఇవ్వాలని గాయత్రి దేవి ఫిలిమ్స్ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో బోలా శంకర్ విడుదల సందర్భంగా తన డబ్బు తనకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ సతీష్. బోలా శంకర్ నిర్మాతలపై హైదరాబాదులోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది గాయత్రి దేవి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ.

తన సంతకం ఫోర్జరీ చేశారు – భోళా శంకర్ నిర్మాత

ఇవి కూడా చదవండి

రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పంద పత్రాల పైన తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తున్నారు బోళా శంకర్ నిర్మాతలు. బోలా శంకర్ సినిమాను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని బోలా శంకర్ నిర్మాతలు చెబుతున్నారు. చిరంజీవి సినిమా కావటంతో కుట్రపూరితంగా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో గాయత్రి ఫిలిమ్స్ చూపిన అగ్రిమెంట్లో తాము ఎక్కడ సంతకాలు చేయలేదని తాము సంతకాలు చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారని భోళా శంకర్ నిర్మాతలు వాదిస్తున్నారు.. 200 కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాను నిలుపుదల చేయాలని కోరడం సరైనది కాదంటూ కోర్టులో వాదించారు. ఇరువురి వాదనలు విన్న సిటీ సివిల్ కోర్ట్ రేపు తీర్పు ప్రకటించనుంది.

నాకు ప్రాణహాని ఉంది.నాకు భద్రత కల్పించండి – డిస్ట్రిబ్యూటర్ సతీష్

ఈ వ్యవహారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కొనసాగుతుండగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివిఆర్ అందుకు డిస్ట్రిబ్యూటర్ సతీష్ ఫిర్యాదు చేశారు. భోళా శంకర్ పై కోర్టులో పిటిషన్ వేసినందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పిటిషన్ వెనక్కి తీసుకోవాలని లేకుంటే చంపేస్తామని వస్తున్న కాల్స్ ను డిస్ట్రిబ్యూటర్ సతీష్ పోలీసుల దృష్టికి తెచ్చాడు. తనకు రావాల్సిన 30 కోట్లు వ్యవహారంలో ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నుండి మనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని హైదరాబాద్ పోలీసులకు విన్నవించుకున్నాడు.