Megastar Chirnajeevi: రేపే భోళాశంకర్ రిలీజ్.. హైదరాబాద్‌లో మొదలైన మెగా ఫ్యాన్స్ హంగామా .. ఏపీలో టికెట్ ధరల పెంపుపై రగడ.. – Telugu News | Ap minister chelluboina srinivas Sensational Comments on Bhola Shankar movie
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో మెగా అభిమానులు సందడి చేస్తుంటే.. మరోవైపు ఏపీలో టికెట్ ధరలపై పెంపు విషయంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో ఏర్పడిన వివాదంపై సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. టికెట్ల పెంపునకు అనుమతి, చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. టికెట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం 12 అంశాల్లో వివరణ కోరితే దానికి ఇంత వరకు వారు నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. తమ ప్రభుత్వానికి సినీరంగంపై అపారమైన ప్రేమ ఉందని అన్నారు. ఆశ్రిత పక్షపాతం, వ్యక్తిగతమైన ఆలోచనలు తమ ప్రభుత్వంలో ఉండవని చెల్లుబోయిన స్పష్టం చేశారు.
ఏపీలో టికెట్ ధరల పెంపు రగడ
రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిరంజీవి భోళా శంకర్ సినిమా. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో రగడ నెలకొంది. టికెట్ల పెంపునకు ఏపీ సర్కారు అనుమతించలేదు. గతంలో సినిమా టిక్కెట్ల ధర పెంపునకు అనుమతించిన సందర్భాలున్నాయి. ఈ సారి ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదంటూ.. కొన్ని కారణాలు వివరిస్తోంది ఏపీ సర్కారు.
మొదలైన మెగాస్టార్ మానియా..
భోళా శంకర్ మానియా మొదలైంది. హైదరాబాద్‌లో రోడ్లపై అభిమానులు హంగామా చేశారు. చిరంజీవి టీషర్ట్‌లు ధరించి, జెండాలు పట్టుకుని.. వాహనాల్లో తిరుగుతూ సందడి చేశారు. భోళా శంకర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు అంతకుమించి అనేలా పెరిగిపోయాయి. రేపు సినిమా రిలీజ్ అవుతుండటంతో చిరు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అంచనాలు పెంచేసిన ట్రైలర్
భోళా శంకర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచింది. ఇందులో చిరు లుక్స్… స్టైల్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుచేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు తమ అభిమానాన్ని చాటుకుంటూ ర్యాలీలు తీస్తున్నారు. భోళా శంకర్ సినిమాపై మరింత హైప్ తెచ్చే విధంగా చిత్ర నిర్మాణ సంస్థ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ఏర్పాటు చేసింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..