OG: పవర్ స్టార్ పుట్టిన రోజున ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే న్యూస్.. ఓజీ నుంచి నయా పోస్టర్ – Telugu News | Pawan Kalyan OG Movie new poster released, with new update releasing on September 2nd
వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. వకీల్ సాబ్ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా బ్రో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్ ఇక ఇప్పుడు ఓజీగా రానున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎలక్షన్ టార్గెట్ గా ఏపీలో వారాహి యాత్ర చేస్తున్నాడు పవర్ స్టార్. అలాగే వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. వకీల్ సాబ్ మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వచ్చిన భీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా బ్రో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్ ఇక ఇప్పుడు ఓజీగా రానున్నాడు. సముద్ర ఖని దర్శకత్వంలో వచ్చిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుజిత్. ఆతర్వాత ప్రభాస్ తో కలిసి సాహో అనే సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా భీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు పవన్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు సుజిత్. ఓజీ అనే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది.
తాజాగా ఓజీ నుంచి క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పెద్ద తుఫాన్ రాబోతుంది అంటూ ఓ ప్రీరిలీక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ను ఇవ్వనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తన గ్యాంగ్ తో కలిసి రౌడీలను చంపి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో పవన్ చేతిలో గన్ కనిపిస్తుంది. ఈ మూవీ ముంబైలో జరిగిన కథ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.