KUSHI Musical Concert LIVE: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అటు విజయ్ దేవరకొండ కి కానీ ఇటు సమంతకి కానీ పాన్ ఇండియా రిలీజ్ కొత్త కాకపోయినా ఇప్పుడు వీరిద్దరికీ ఒక సాలిడ్ హిట్ అవసరం. టక్ జగదీష్ లాంటి డిజాస్టర్ తర్వాత శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఆయనకు కూడా చాలా కీలకమే. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది.
Chiranjeevi: అనిల్ సుంకరకు చిరంజీవి భరోసా?
ఈ మధ్యనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి దాదాపు 300 మంది ఇతర భాషలకు చెందిన జర్నలిస్టులను తీసుకువచ్చి హైదరాబాద్ అంతా తిప్పి పంపించారు. ఇక ఇప్పుడు లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి హృదయం ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహాబ్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే చెప్పాలి. ఆయన అందించిన దాదాపు చాలా సాంగ్స్ ఇప్పుడు చాట్ బస్టర్లుగా నిలిచి అన్ని మ్యూజిక్ యాప్స్ తో పాటు యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో అదే మ్యూజిక్ ని మరోసారి లైవ్ లో పెర్ఫార్మ్ చేసేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఆ ప్రోగ్రాం ని ఎన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం అది ఏంటో మీరు చూసేయండి