Leading News Portal in Telugu

Senior Heroine Rashi: ప్రభాస్ పక్కన అలాంటి పాత్ర అయితేనే చేస్తా.. అదే నా ఆశ


Senior Heroine Rashi: అందాల రాశి.. రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన ఆమె హీరోయిన్ గా మారి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి తర్వాత కూడా రాశికి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం నో చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే సినిమాల ద్వారా రాశికి దక్కని పేరు సీరియల్ ద్వారా ఆమె సొంతం చేసుకుంది. జానకి కలగనలేదు అనే సీరియల్ తో రాశికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ ముగింపు దశకు చేరుకుంది. దీంతో సీరియల్ నటులు ఒక యూట్యూబ్ బ్లాగ్ చేయగా అందులో తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇందులో ఆమె తనకు నచ్చిన హీరో గురించి మాట్లాడింది. తనకు ఆల్ టైం ఫేవరెట్ అంటే శోభన్ బాబు అని, ఆ తర్వాత చిరంజీవి అని చెప్పుకొచ్చింది, ఇక ఇప్పటి కుర్ర హీరోల్లో తనకు ప్రభాస్ అంటే బాగా ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా తను ఇప్పటి వరకు నటించని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అని, ఆయనతో నటించాలని ఆశగా ఉందని తెలిపింది.

Chiranjeevi: మహేష్ ‘స్పైడర్’ డైరెక్టర్ తో చిరంజీవి.. అసలు నిజం ఇదే ?

“ప్రభాస్ నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలని ఉంది. అది కూడా ఆయనతో హీరోయిన్ గా చేయాలి.. తల్లిగా అంటే అస్సలు చేయను. అయితే ఇప్పటివరకు నేను ప్రభాస్ ను చూడలేదు. కలిసి మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ చేసే సమయంలో ఒకే హోటల్ లో నేను, ప్రభాస్ ఉన్నాం. ఆ హోటల్ లో ప్రభాస్ ఉన్నాడని తెలిసి నేను ఎగిరి గంతేశాను. వర్షం తరువాత అడవి రాముడు తీస్తున్నాడు. వర్షం సినిమా కూడా చూడలేదు. ఈశ్వర్ ట్రైలర్ లో చూసి ప్రభాస్ ను ఇష్టపడ్డాను. ఇక ప్రభాస్ ను కలవాలి.. ప్రభాస్ కలవాలి అని అరుస్తుంటే మా అన్నయ్య .. ఏంటి.. ఇలా ఎగురుతున్నావ్.. నువ్వు చాలామంది హీరోలతో చేసావ్ అని అన్నాడు. నేను వెంటనే ప్రభాస్ తో మాట్లాడాలి ఎలాగైనా.. కనీసం కలవలెను.. ఫోన్ లో అయినా మాట్లాడతా అని ఆయన ఉన్న రూమ్ కు కాల్ చేసి.. వర్షం సినిమా చూడకపోయినా.. మీ సినిమా చూసాను.. చాలా బావుంది.. మీరు చాలా బావున్నారు అని చెప్పాను. దానికి ప్రభాస్.. ఎంతో మర్యాదగా.. నిదానంగా థాంక్స్ అండి అని అన్నాడు. నేను వినడం అయితే ప్రభాస్ చాలా మంచి మనిషి అని విన్నాను. సీనియర్స్ కు చాలా మర్యాద ఇస్తారని విన్నాను” అని తెలిపింది. ఇక ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ షేర్ చేసి ఆయన గొప్పతనం గురించి చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.