Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోకాలు సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న చిరు.. పరాజయంతో పాటు ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు. అందులో ముఖ్యంగా నిర్మాత అనిల్ సుంకర, చిరు రెమ్యూనరేషన్ విషయంలో ఘాటు ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. చిరు, నిర్మాత అనిల్ సుంకర వద్ద తన రెమ్యూనిరేషన్ మొత్తాన్ని ఇవ్వమని గట్టిగా అడిగినట్లు.. దానికోసం అనిల్ సుంకర ఇల్లు, పొలాలు తాకట్టు పెట్టినట్లు వార్తలు వచ్చాయి, దీంతో నెటిజన్స్ చిరుని, అనిల్ సుంకరాను ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ ట్రోలింగ్ పై అనిల్ సుంకర వివరణ కూడా ఇచ్చాడు. ఈ వార్తల్లో ఎలాంటి నిజమో లేదని, చిరు తనను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, ఆయన ఎప్పుడూ సపోర్ట్ గానే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అందుతున్న ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. భోళా శంకర్ కు చిరు తీసుకున్న రెమ్యూనిరేషన్ లో పది కోట్లు నిర్మాతలకు ఇచ్చేసినట్లు సమాచారం.
NTR: మరోసారి సిక్స్ ప్యాక్ తో ఎన్టీఆర్.. దానికోసమే.. ?
వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య కు చిరు రెమ్యూనిరేషన్ రూ. 50 కోట్లు అంట. ఆ సినిమా హిట్ అవ్వడంతో రెమ్యూనిరేషన్ పెంచిన చిరు భోళా శంకర్ కు రూ. 60 కోట్లు తీసుకున్నాడట. సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతలు రూ. 50 కోట్లు ఇచ్చేసి.. మిగతా రూ. 10 కోట్లు.. చెక్ రూపంలో ఇచ్చారట. ఆ చెక్ ను బ్యాంక్ లో వేయగా.. భోళా శంకర్ రిలీజ్ అయిన రెండు రోజులకు అకౌంట్ లో పడతాయని తెలిపినట్లు తెలుస్తోంది. ఇక మొదటి షో తోనే రిజల్ట్ తెలుసుకున్న చిరు.. నిర్మాతల కష్టాన్ని అర్ధం చేసుకోని.. ఆ చెక్ ను వెనక్కి ఇచ్చేశారని టాక్. అంటే ఎప్పటిలానే చిరు తన రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకున్నాడు. అనిల్ సుంకరను ను ఇంత ఇవ్వమని డిమాండ్ చేసింది లేదు అని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ చిరు గొప్పతనాన్ని ట్రోలర్స్ కు అర్థమయ్యేటట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత నేది తెలియాలంటే చిత్ర బృందం నోరు తెరవాల్సిందే.