NTR: తెలుగా సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన హీరో ఎన్టీఆర్. సిని ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని కుటుంబాలు వచ్చినా.. ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చినా సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు మారదు. ప్రేక్షకుల గుండెల్లో ఆయన రూపం చెదిరి పోకుండా కలకాలం అలా నిలిచిపోతుంది. అంతటి ప్రత్యేక గుర్తింపు మరి ఎవరికి రాదనే చెప్పాలి. అలాంటి మహనీయుడి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ తన ఆఖరి రోజుల్లో చేసిన పనులు.. ఆయన పడిన బాధకు సంబంధించిన విషయాలను ఆయన అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ మరికొద్ది గంటల్లో చనిపోతారని తెలిసినప్పుడు ఆయన చివరిగా చేసిన ఫోన్ ఆయన శ్రేయోభిలాషి, ప్రాణ స్నేహితుడు అక్కినేని నాగేశ్వరరావుకంటూ తెలుస్తోంది. మనకు తెలిసిందే అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు మంచి మిత్రులు. ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ స్థాయికి రావడానికి కారణం వారిద్దరే. ఈ విషయాన్ని ఎవరైనా కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు మధ్య అప్పట్లో కొందరు వ్యక్తులు చిచ్చు పెట్టారు . ఈ క్రమంలోనే ఆఖరి రోజుల్లో వారు మాట్లాడుకోలేదు. అయితే ఫైనల్లీ ఎన్టీఆర్ – నాగేశ్వరరావు గారికి కాల్ చేసి ‘నీతో మాట్లాడాలని ఉంది .. నీతో కలిసి భోజనం చేయాలని ఉంది.. ఇంటికి రా’ అంటూ ఫోన్ చేశారట . అయితే నాగేశ్వరరావు కూడా ‘వస్తున్నాను’ అంటూ చెప్పి ఫోన్ కట్ చేశారు . అయితే అలా కట్ చేసిన కొద్ది నిమిషాలకే ఎన్టీఆర్ మరణించారు. ఆయన మరణ వార్త అక్కినేని నాగేశ్వరరావు గారికి చేరింది. ఈ విషయం తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారట . ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయింది.