Leading News Portal in Telugu

Rajinikanth: యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడంపై స్పందించిన రజినీ .. ఏమన్నాడంటే.. ?


Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈ మధ్యనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం జరిగింది. అయితే రజినీ, ఆయన్ను చూడగానే.. వెంటనే ఆయన కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారింది. లక్నోలో యూపీ సీఎం ఇంటి ముందు ఇలా కారు దిగిన వెంటనే.. రజినీ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన యోగి కాళ్లను తాకడానికి వంగడం.. వెంటనే యోగి సైతం రజినీని ఇలాంటి వద్దని చెప్పేలోపే ఆయన పాదాలకు నమస్కరం చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో రజినీపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వయసులో చిన్నవాడైన సీఎం కాళ్లు రజినీకాంత్ మొక్కడం ఏంటని నానా హంగామా చేశారు ట్రోలర్స్.

Vijay Devarakonda: రజినీకాంత్ తో పోల్చుకుంటున్న విజయ్.. ?

ఇక రజినీ తీరు ఆయన అభిమానులకు కూడా ఆగ్రహం కల్పించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అయ్యి ఉండి .. ఒక రాజకీయ నాయకుడు పైగా వయస్సులో 20 ఏళ్ళు చిన్నవాడి కాళ్ళు మొక్కడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇంకోపక్క రాజకీయపరంగా కూడా ఎన్నో విమర్శలను లేవనెత్తారు. అయితే ఇప్పటివరకు ఈ విషయమై రజినీ స్పందించలేదు. తాజాగా తన ఆధ్యాత్మిక ట్రిప్ ను ముగించుకొని నేడు చెన్నె ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టాడు తలైవా. ఇక ఆయన రావడం రావడం.. ఇదే ప్రశ్నతో రిపోర్టర్లు రచ్చ చేశారు. దీంతో రజినీ సమాధానం చెప్పక తప్పలేదు. ” ఎవరైనా నాకంటే చిన్నవారైనా, వారు యోగి/స్వామిజీ అయితే, వారి కాళ్లపై పడి ఆశీర్వాదం పొందడం నా పద్ధతి” అంటూ ఒక్క మాటతో తేల్చేశాడు. ఇక ఈ మాటతో ఆ విమర్శలు అన్ని పటాపంచలు అయిపోయాయి. రజినీ చెప్పినదాంట్లో తప్పేముంది.. స్వామిజీ, యోగులు కనపడితే ఎవరైనా కాళ్లు మొక్కుతారు కదా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రజినీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.