Vijay Devarakonda: ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరు ఎంతలా వినిపిస్తుందో అందరికి తెల్సిందే. మొదటి నుంచి కూడా విజయ్ తాన్ సినిమా రిలీజ్ కు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో దేన్నీ వదలకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ప్రెస్ మీట్స్, మ్యూజిక్ కన్సర్ట్స్, టూర్స్ అంటూ రచ్చ చేస్తాడు. ఇక ఇప్పుడు ఖుషీ సినిమాకు కూడా అదే చేస్తున్నాడు. విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ లో స్టేజిపై రసమంత, విజయ్ రెచ్చిపోయి డ్యాన్స్ వేసి సినిమాపై మరింత హైప్ తెచ్చారు. అనారోగ్య కారణాల వలన సమంత ప్రమోషన్స్ కు రాకపోవడంతో.. ఆ బాధ్యత మొత్తాన్ని విజయ్ తన భుజాల మీద వేసుకున్నాడు. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ కావడానికి అన్నిచోట్ల ప్రెస్ మీట్లు పెట్టి అభిమానులను ఆకర్షిస్తున్నాడు రౌడీ హీరో.
Anushka: ఏందయ్యా ఇది.. అనుష్క ముఖాన్ని ఇలా మార్చేశారు.. ముందే చూసుకోవద్దా.. ?
తాజాగా నేడు చెన్నెలో ప్రెస్ మీట్ కు హాజరయ్యాడు విజయ్. అక్కడ రజినీకాంత్ గురించి మాట్లాడి హాట్ టాపిక్ గా మారాడు. వరుస ప్లాప్ లు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ముందుకు కొనసాగడంపై ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానమిస్తూ.. ” రజినీకాంత్ సర్ .. వరుసగా 6 ప్లాపులు ఇచ్చారు. ఇప్పుడు జైలర్ తో రూ. 500 కోట్ల రికార్డ్ ను సాధించారు” అని చెప్పినట్లు సమాచారం. దీంతో విజయ్ కూడా వరుసగా ప్లాప్స్ ఇచ్చినా కూడా ఈ సినిమాతో హిట్ కొడతాను అని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలు చేయడంతో విజయ్.. తనకు తాను రజినీతో పోల్చుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. అయితే నిజానికి విజయ్ సాధారణంగానే ఆ మాటలు మాట్లాడినట్లు మరికొందరు అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనేది విజయ్ మాత్రమే చెప్పాలి. మరి ఖుషీతో విజయ్ హిట్ ను అందుకుంటాడా.. ? లేదా అనేది తెలియాల్సి ఉంది.