Leading News Portal in Telugu

Preeti Jhangiani: ‘తమ్ముడు’ సినిమా హీరోయిన్ ఏంట్రా.. ఇలా మారిపోయింది


Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. బాలకృష్ణ, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించిన ఆమె.. తెలుగులోనే కాదు.. మిగతా అన్ని భాషల్లో హీరోయిన్ గా మంచి విజయాలను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు పర్విన్ దబ్బాస్‌ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇద్దరు పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

Uttar Pradesh: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు..89 మంది బాలికలు మిస్సింగ్

ఇక సోషల్ మీడియా వచ్చాకా.. అందులో అభిమానులకు దగ్గరగా ఉంటూ తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో చాలా మార్పు వచ్చింది. కానీ, చాలామంది హీరోయిన్స్ లా బరువు పెరగకుండా తన అందాన్ని కాపాడుకుంటుంది అని కనిపిస్తుంది. అయితే అప్పుడు ఉన్న లుక్ మాత్రం పోయిందని చెప్పాలి. ముఖంలో అప్పటి కళ లేదు.. ఇప్పుడు ఉన్న ప్రీతి పూర్తిగా మారింది. పెళ్లి తరువాత మహిళ మారుతుంది.. అనేది అందరికి తెల్సిందే. అయినా ఈ వయస్సులో కూడా ఆమె తన బాడీ ఫిట్ నెస్ గా ఉంచుకుంటూ మెయింటైన్ చేస్తుంది అంటే గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ మధ్యనే ఆమె కఫాస్ అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. మరి ముందు ముందు ఈ భామ తెలుగులో కూడా ఏమైనా అడుగుపెడుతుందేమో చూడాలి.