Leading News Portal in Telugu

Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. తల్లిదండ్రులతో మెగా బ్రదర్స్


Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మరెంతోమందికి దేవుడు. ఇక చిరంజీవి అనే వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మెగా హీరో అని చెప్పుకొనే ప్రతి హీరో.. మెగాస్టార్ అనే వృక్షం నుంచి వచ్చిన కొమ్మలే. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, సుస్మిత.. ఇలా వీరందరూ మెగా అని ముందు పెట్టుకోవడానికి కారణం కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి ల పెద్ద కుమారుడిగా 1955 ఆగష్టు 22 న జన్మించాడు. సినిమాల మీద ఆసక్తితో ఒక్కడే.. ఏమి తెలియకపోయినా.. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకొని.. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి.. హీరోగా మారాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా.. ఇండస్ట్రీకి పరిచయమై.. స్వయంకృషితో మెగాస్టార్ గా మారాడు.

Samantha: ప్రమోషన్స్ కు రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని.. అక్కడ నువ్వు చేసే పని ఇదా..?

ఇక నేడు చిరంజీవి 68 వ పుట్టినరోజు. ఈరోజు వరకు కూడా తన తండ్రి నేర్పిన సంస్కారం..ఆదర్శభావాలతోనే చిరు నడుస్తున్నాడు. తన తండ్రి తనతో లేకపోయినా.. తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆ తండ్రి ప్రేమను పంచుతూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు చిరు తల్లితో, తమ్ముళ్ళతో.. మానవరాళ్లతో కలిసి దిగిన ఫోటోలను చూసి ఉంటారు. కానీ, చిరు.. తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో చాలా రేర్. అది కూడా మెగా బ్రదర్స్ ముగ్గురు ఉండడం మరింత రేర్. తాజాగా ఆ అరుదైన ఫోటో నేడు బయటపడింది. తల్లిదండ్రులు అయిన కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫొటోలో చిరు భార్య సురేఖ.. పెద్ద కుమార్తె సుస్మితను కూడా చూడొచ్చు.ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు పిక్ ఆఫ్ ది డే ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.