Leading News Portal in Telugu

Rajinikanth: ఇండియా సక్సెస్ చూసి అగ్రరాజ్యాలు అలా చూస్తున్నాయి



Rajini

Rajinikanth: ఇస్రో.. ఎట్టేకలకు అనుకున్నది సాధించింది. ఎన్ని అవమానాలు పడినా తిరిగి నిలబడింది. ఇండియా పేరును ప్రపంచ దేశాల్లో మారుమ్రోగేలా చేసింది. చంద్రయాన్ 3 విజయం అందుకుంది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. ఈరోజు చరిత్రలో నిలబడిపోయేలా చేసింది. అగ్రరాజ్యాలు అన్ని ఇండియా వైపు చూసేలా చేసింది. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ ను చూసి ఇండియన్స్ గాల్లో తేలిపోతున్నారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టి అక్కడ ఫోటోలను కూడా తీసుకొచ్చేస్తుంది. ఇక ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించాడు. ఈ సక్సెస్ భారతీయలను గర్వపడేలా చేసింది అంటూ ట్వీట్ చేశాడు.

Akshay Kumar: చంద్రయాన్ 3 బయోపిక్.. హీరో ఎవరంటే.. ?

” అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఆశ్చర్యంతో చూస్తుండగా, భారతదేశం ఈ భారీ విజయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మొట్టమొదటిసారిగా, చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని ల్యాండ్ చేయడం ద్వారా మన దేశం ఒక గొప్ప గుర్తింపును అందుకుంది. మన ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రజినీ సినిమాల విషయానికొస్తే.. జైలర్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా తరువాత రజినీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.