Leading News Portal in Telugu

Allu Arjun: నేషనల్ అవార్డ్ ప్రకటన.. సుకుమార్ ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్


Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగానే ఐకాన్ గా నిలిచాడు. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో తీసుకురాలేని అరుదైన గౌరవాన్ని బన్నీ తీసుకొచ్చాడు. 69 వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేస్తున్నారు. ఇక విషయం తెలియడంతో అల్లు అరవింద్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ తెలిపారు.

RRR: జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్.. ఏకంగా ఆరు విభాగాల్లో

ఇక తనకు పుష్ప లాంటి సినిమాను అందించిన సుకుమార్ ను పట్టుకొని బన్నీ కంటనీరు పెట్టుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని సుకుమార్, బన్నీ ఏడ్చేశారు. అందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకుంది. 69 ఏళ్ళల్లో ఈ ఘనత సాధించిన అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక వీడియోలో అల్లు అరవింద్, అల్లు స్నేహ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ ఫ్యాన్స్.. ఈ వీడియోను వైరల్ చేసేస్తున్నారు.