Leading News Portal in Telugu

Jabardasth Rohini: వాడెవడు.. ఆఫ్ట్రాల్ గాడు.. నా కాలి గోటికి కూడా సరిపోడు..


Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఇక ఈ మధ్యనే ఆమె హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం విజయవాడ నుంచి వస్తుండగా రోహిణికు కారు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కాలికి రాడ్ వేయగా దాన్ని తొలగించకుండా ఎక్కువ సమయం ఉంచడంతో ఇన్ఫెక్షన్ అయింది. దీంతో ఈ మధ్యనే సర్జరీ చేసి ఆ రాడ్ ను వైద్యులు తొలగించారు. ఇక ఈ సమయంలో ఆమె ఎంతో బాధపడింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే రోహిణి షోలు స్టార్ట్ చేస్తుంది. తాజాగా ఒక షోలో మొట్టమొదటిసారి రోహిణి తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రోహిణికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..? లేడా..? అనే విషయం ఎవరికీ తెలియదు.

Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?

ఇక తాజాగా ఆమె తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని తెలిపింది. బ్రేకప్ తర్వాత చాలా నరకాన్ని అనుభవించానని, ఆ సమయంలో తన ఫ్రెండ్స్ తనకు సపోర్ట్ గా నిలిచారని చెప్పింది. “నా ఫ్రెండ్స్ అందరూ అసలు వాడెవడు.. నీ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ చెప్పేవారు. అప్పుడు నాకు కూడా అనిపించింది.. వీడు ఆఫ్టర్ గాడు.. వీడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానని అనుకున్నాను.. వారి సపోర్ట్ వల్లనే నేను ఆ ఫేజ్ నుంచి బయటపడ్డాను” అని తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో రోహిణినిప్రేమించి వదిలేసిన అబ్బాయి ఎవరు అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.