Leading News Portal in Telugu

Posani Krishna Murali : అల్లు అర్జున్ లో వున్న గొప్ప లక్షణం అదే..


రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన అవార్డ్స్ లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే దక్కాయి.నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఎవరు సాధించని ఘనత ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి తెలుగు హీరో గా అల్లు అర్జున్ నిలిచారు.దీంతో అభిమానులు,రాజకీయ నాయకులు మరియు సెలబ్రిటీలు అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది.ఈ క్రమం లో టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన పోసాని కృష్ణ మురళి కూడా అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

ఈ సందర్బంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషం గా ఉంది. భవిష్యత్ లో అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది. తెలుగు సినిమాల కు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం.అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను కూడా అల్లు అర్జున్‌ కి చాలా ఇష్టం. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నిరంతరం నేర్చు కుంటూనే ఉంటాడు. అది అతని లో ఉన్న గొప్ప లక్షణం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరో కి దక్కలేదు..అల్లు అర్జున్ సాధించడం ఎంతో గొప్ప విషయం.అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో కచ్చితంగా ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. రాబోయే కాలం లో అల్లు అర్జున్ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి. ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.