Leading News Portal in Telugu

Akhil Akkineni : ఆ దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్స్ అయిన అఖిల్..?


అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది.. కాని ఇప్పటి వరకు తన కెరీర్ ను నిలబెట్టే ఒక్క కమర్షియల్‌ సక్సెస్‌ ని కూడా సాధించలేకపోయాడు అఖిల్‌. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌తో హిట్ అందుకున్న కానీ ఆ సినిమాతో కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. దాంతో దాదాపు రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని ఏజెంట్‌ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్. సిక్స్ ప్యాక్ ను రెండు మూడేళ్లు అలాగే మైయింటైన్ చేస్తూ వచ్చాడు.అంతే కాదు నటనలోను బాడీ లాంగ్వేజ్ లో కూడా కొత్తగా ఆకట్టుకున్నాడు.ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టాడు. కాని భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌ గా నిలిచింది.కథలో కొత్త దనం లేకపోవడంతో దర్శకుడు సురేందర్‌ రెడ్డికి కూడా ఈ సినిమాతో పెద్ద దెబ్బ తగిలింది.. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. రెండేళ్లు తీవ్రంగా శ్రమించిన అఖిల్‌ను ఈ సినిమా ఫలితం ఎంతగానో నిరాశపరిచింది. దాంతో ఈసారి సారి ఎలాగైనా సాలిడ్‌ కంబ్యాక్‌ ఇచ్చి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అఖిల్. ఇక అఖిల్ తరువాత సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అఖిల్ తన తరువాత సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్ లో చేయబోతున్నట్టు సమాచారం.. రీసెంట్ గా శ్రీకాంత్ అఖిల్‌కు ఓ మాస్‌ కథను చెప్పగా అఖిల్‌కు ఆకథ తెగ నచ్చేసిందట.దీనితో  వెంటనే ఆ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చాడని సమాచారం.. శ్రీకాంత్ అడ్డాల నారప్పతో మాస్ ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించాడు.ప్రస్తుతం పెద్ద కాపు అనే ఓ మాస్‌ కమర్షియల్‌ సినిమాని తీస్తున్నాడు.ఇప్పటికే పెద్ద కాపు నుంచి విడుదల అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ గ్లింప్స్‌ చిత్రంపై అంచనాలు పెంచేసాయి.. ఇక ఇప్పుడు అఖిల్‌తో కూడా అలాంటి ఓ మాస్‌ సినిమానే ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే చాన్స్‌ ఉంది.మరి ఈ సినిమాతో అయిన అఖిల్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.