
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. దీంతో ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చూడని రేంజ్ కంబ్యాక్ ని రజినీ చూపించాడు. రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు రజినీకాంత్. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్. 2023 కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన జైలర్ సినిమా దెబ్బకి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి.
కోలీవుడ్ టాప్ 2 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన జైలర్ సినిమా, తమిళనాడులోనే కాదు అన్ని సెంటర్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. తెలుగులో 75 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా, ఒక తమిళ డబ్బింగ్ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంది. కర్ణాటకాలో కూడా జైలర్ సినిమానే టాప్ పొజిషన్ లో ఉంది, ఇక్కడ జైలర్ మూవీ 70 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ లాల్ లాంటి ఎలైట్ హీరోలకి మాత్రమే సాద్యమైన 50 క్రోర్ క్లబ్ లో జైలర్ జాయిన్ అయ్యింది. ఈ మూడు సెంటర్స్ లో జైలర్ ఇప్పుడు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాగా నిలిచింది. ఇక్కడ ఇంకో రేర్ ఫీట్ ఏంటి అంటే బాహుబలి 2, KGF 2 సినిమాల తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని సెంటర్స్ లో 50 కోట్ల మార్క్ ని రీచ్ అయిన సినిమాగా జైలర్ నిలిచింది. దీంతో ఎన్ని సంవత్సరాలు అయినా కోలీవుడ్ ఇండస్ట్రీకి ఒకడే సూపర్ స్టార్ అనే విషయం మరోసారి అర్ధం అయ్యింది.