Leading News Portal in Telugu

NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?



Ntr H

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబ వేడుకల్లో చాలా రేర్ గా కనిపిస్తాడు. అందుకు కారణాలు ఎన్నైనా ఉన్నా.. బయట అభిమానులు మాత్రం నందమూరి కుటుంబం వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేసారు. ఎన్టీఆర్ కు తన తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో.. ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరును నిలబెట్టిన మనవడిగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీ మొత్తం ప్రశంసిస్తుంది. ఇక తాతకు సంబంధించిన ఫంక్షన్స్ లోనూ ఎన్టీఆర్ కనిపించడు. ప్రతి ఏడాది.. సీనియర్ ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ న సందర్శించి తాతకు నివాళులు అర్పిస్తాడు. అంతేతప్ప.. వేరే ఏ ఫంక్షన్ లో కూడా తారక్ కనిపించిన దాఖలాలు లేవు.

ఇక ఈ మధ్య శతజయంతి ఉత్సవ సభ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెల్సిందే. దానికి ఎన్టీఆర్ కు ఆహ్వానం కూడా అందింది. అయినా తారక్ రాలేదు. తన కుటుంబంతో విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కు వెళ్తున్నట్లు తెలిపాడు. ఇక అప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అది ఇంకా మర్చిపోలేదు.. అప్పుడే మరో ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడం లేదని తెలుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రంతో ప్రత్యేకమైన రూ.100 నాణెం తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఈ నాణెం ఆవిష్కరణ ఆగస్టు 28 న.. అనగా రేపు రాష్ట్రపతి భవన్ లో జరగనుంది.

ఇక ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మరో 100 కు పైగా అతిధులు రానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ ఈ వేడుకకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎడతెరిపి లేకుండా జరుగుతుందంట. దాని కారణంగానే రేపు ఆ వేడుకకు ఎన్టీఆర్ వెళ్లడం లేదని టాక్ నడుస్తోంది. ఇక దీంతో అభిమానులు మరో సరి అనుకున్నదే అయ్యింది.. ముందే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వెళ్లడని అనుకున్నాం.. అదే అయ్యిందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.