Leading News Portal in Telugu

Eagle : విందు భోజనం లా ఉండబోతున్న ఈగల్ మూవీ సాంగ్స్..


ప్రస్తుతం వరుస సినిమాల తో ఎంతో బిజీ గా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన నటిస్తోన్న తాజా చిత్రాల్లోఈగల్‌ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్‌ మూవీ లో రవితేజ సరసన అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కావ్య థాపర్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా పాటలపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. ధమాకా సినిమా లాంటి మాస్‌ సాంగ్స్ ఈ సినిమాలో ఉండేలా చూడండి సాంగ్స్ మంచి హిట్టవ్వాలి అంటూ ఓ నెటిజన్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ట్వీట్ చేశాడు.దీనిపై మేకర్స్‌ స్పందిస్తూ.. ఈగల్‌ పాటలపై ఎలాంటి సందేహం వద్దు. ఈ సినిమాలో పాటలు విందుభోజనంలా ఉండబోతున్నాయి రవితేజ ఫ్యాన్స్ కు చాలా స్పెషల్‌ సాంగ్స్‌ కాబోతున్నాయి అని రీ ట్వీట్‌ చేసింది. దీంతో రవితేజ ఈ సారి కూడా తన నుంచి అభిమానులు కోరుకుంటున్న ఎనర్జిటిక్‌ సాంగ్స్‌ను అందించబోతున్నాడని ట్వీట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. ఈగల్‌ చిత్రీకరణ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగింది.. రీసెంట్‌ గా కొత్త షెడ్యూల్‌ కోసం హీరో రవితేజ మరియు మూవీ టీం లండన్‌కు చేరుకున్నారు.రవితేజ రీసెంట్‌ గా లండన్ కి వెళ్తూ విమానంలోని బిజినెస్‌ క్లాస్‌ లో దిగిన ఫొటోను ఇన్‌ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసాడు. అలాగే ఈగల్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ లండన్‌ లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్‌ లో రెండు వారాల పాటు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.