Leading News Portal in Telugu

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలట..


Sudigali Sudheer About Qualities of his Fiance: సుడిగాలి సుధీర్ రష్మీ మధ్య లవ్ ఉందని వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కలరింగ్ ఇచ్చేలా ఈటీవీలో అనేక ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ వచ్చారు. నిజానికి తమ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కేవలం కొలీగ్స్ మాత్రమే అని వీరిద్దరూ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వీరిద్దరి ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు తెర మీదకు వస్తూనే ఉంటాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి క్వాలిటీ ఉన్న అమ్మాయి కావాలి అనే విషయం మీద సుడిగాలి సుధీర్ స్పందించాడు. మీకు ఎలాంటి క్వాలిటీ ఉన్న అమ్మాయి కావాలి అని అడిగితే అసలు చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు క్వాలిటీస్ గురించి ఆలోచిస్తానని తనకు ఇప్పుడు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదని సుధీర్ చెప్పుకొచ్చాడు. `

Sudigali Sudheer: మళ్ళీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్.. గుడ్ న్యూస్ చేప్పేశాడు

ఆ తర్వాత సుధీర్ మాట్లాడుతూ ఇదేమైనా కారా ఎంత మైలేజ్ ఇస్తుంది? పవర్ స్టీరింగ్ ఉందా? లేదా? ఇలాంటి క్వాలిటీస్ చూసి పెళ్లి చేసుకోలేము అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన ఉన్నవాడికి ఈ క్వాలిటీ ఉండాలి లేదా ఆ క్వాలిటీ ఉండాలి అని ఆశ ఉంటుంది కానీ తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడికి అమ్మాయి కూల్ గా ఉండడం హ్యాపీగా ఉండడం లాంటి క్వాలిటీ ఉంటే చాలని అనుకుంటారని ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సాధ్యమైనంత వరకు అదే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతకు మించి ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదని ఈ 35 ఏళ్ల జీవితం నేర్పిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సుడిగాలి సుదీర్ పలు షోస్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.