Leading News Portal in Telugu

Thani Oruvan 2: చరణ్ లిస్ట్ లో ఇంకో రీమేక్.. ఇది తప్పదేమో


Thani Oruvan 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ, కెరీర్ మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఈజీగానే అయ్యింది కానీ, రామ్ చరణ్ హీరోగా నిలబడడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఇక చరణ్ ఆ విషయాన్నీ చాలా ఛాలెంజ్ గా తీసుకున్నాడనే చెప్పాలి. విజయాపజయాలను, విమర్శలను పక్కన పెట్టి కథలను నమ్మి సినిమాలు చేశాడు. అలా కథను నమ్మి చేసిన సినిమాల్లో ధృవ ఒకటి. తని ఒరువన్ తమిళ్ రీమేకే ధృవ. జయం రవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ కూడా భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇదే సినిమాను ధృవ పేరుతో చరణ్ రీమేక్ చేశాడు. చరణ్ కెరీర్ లోనే అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన సినిమా అంటే ధృవ అనే చెప్పాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా .. అందాల నటుడు అరవింద్ స్వామి.. స్టైలిష్ విలన్ గా నటించాడు.

Akkineni Nagarjuna : కింగ్ వచ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.

ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అంటే.. 2015 లో రిలీజ్ అయిన ధృవ ఒరిజినల్ సినిమా తని ఒరువన్ కు మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. మోహన్ రాజానే దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా అధికారిక ప్రకటనను మేకర్స్ వీడియో ద్వారా తెలిపారు. ఇందులో హీరో.. విలన్ కోసం వెతుకుంటుండగా.. ఈసారి హీరోను విలన్ వెతకడం కాదు. విలనే హీరోను ఎన్నుకుంటాడు అని మోహన్ రాజా చెప్పుకొచ్చాడు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిపారు. ఇక ఈ వీడియో చూసాక ఆ.. అభిమానులు చరణ్ లిస్ట్ లో ఇంకో రీమేక్ పడింది అని చెప్పుకొచ్చేస్తున్నారు. ధృవ ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెల్సిందే.. ఇప్పుడు ధృవ 2 కూడా అంతే హిట్ అవుతుందేమో.. ఈ రీమేక్ చరణ్ కు తప్పదేమో.. ఈ ఒక్కటి చేసేయ్ అన్న అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.