Leading News Portal in Telugu

Akkineni Nagarjuna : కింగ్ వచ్చేస్తున్నాడు.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.


అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. రేపు ఆగస్టు 29 న కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘Nag 99’ సినిమా నీ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.నాగార్జున తన తరువాత సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కినేని అగ్ర హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ఉదయం గం 10. 27 నిమిషాలకు స్టెల్లార్ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ‘కింగ్ వస్తున్నాడు’ అంటూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఇందులో హీరో సైకిల్ మరియు దాని మీద ఒక పెద్ద కత్తి అలాగే బ్యాగ్రౌండ్ లో విలేజ్ సెటప్ చూస్తుంటే.. నాగ్ ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ఆయన లాంగ్ హెయిర్ అలాగే రఫ్ గడ్డంతో కనిపిస్తున్నాడు. దీనితో ఈ సినిమాలో కనాగ్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారనే అర్ధం అవుతుంది..”ది ఘోస్ట్’ సినిమా ప్లాప్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున.. ‘పొరింజు మరియం జోస్’ అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నట్లు రీసెంట్ గా కొన్ని వార్తలు వినిపించాయి . బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని టాక్ నడిచింది. అయితే చివరకు ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని డైరెక్టర్ గా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.. లేటెస్టుగా విడుదల చేసిన పోస్టర్ లో సినిమా డైరెక్టర్ ఎవరనేది మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రేపు మంగళవారం నాగ్ బర్త్డే సందర్భంగా పూర్తి వివరాలతో Nagarjuna 99 మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ చేయడంతో పాటుగా ఓ టీజర్ ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.వినిపిస్తోంది.అయితే ఈ సినిమాకు ‘నా సామి రంగా’ అనే టైటిల్ కు నాగ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.. అంతేకాదు 2024 సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది