Leading News Portal in Telugu

Boys Hostel : డిజిటల్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?


రీసెంట్ గా  కన్నడ లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మూవీ హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా కన్నడలో జులై 21న విడుదల అయి  బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ సినిమాని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు.బాయ్స్ హాస్టల్ సినిమా ఆగస్టు 26న విడుదలై ఈ మూవీ ఇక్కడ కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. బాయ్స్‌ హాస్టల్‌ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు.కాంతార, విరూపాక్ష సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ బాయ్స్‌ హాస్టల్‌కు మ్యూజిక్ అందించారు. కన్నడలో స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాను విడుదల చేయగా తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను విడుదల చేసాయి..

తెలుగు వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసి విడుదల చేయడం జరిగింది.ఒరిజనల్‌ మూవీ లో రిషబ్ శెట్టి మరియు రమ్య పోషించిన పాత్రల్లో తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు కనిపించి ఎంతో సందడి చేశారు. యూత్ కి ఎంతగానో నచ్చిన బాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఓటీటీ విడుదల తేదికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన జీ 5 ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచే బాయ్స్‌ హాస్టల్‌ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే ఆ తేదీన కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ చేయడంపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్‌ అయితే రాలేదు. తెలుగు వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుండడంతో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌ కాస్త ఆలస్యం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం