Narakasura Movie : పలాస హీరో రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా శత్రు కీలక పాత్రధారిగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘నరకాసుర’. పేరుతోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాను సెబాస్టియన్ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్ చూసిన పలువురు అయితే ఈ టీజర్ ‘కాంతార రేంజ్‌లో ఉందని’ కూడా ప్రశంసించారు. ఇక ఇప్పటికే షూట్ మాత్రమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో తెలుగు రోజా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అంటే పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Rocking Rakesh: హీరోగా జబర్దస్త్ కమెడియన్.. రోజా చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్
‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. నాజర్, చరణ్‌రాజ్, శ్రీమాన్, ఎస్‌ఎస్ కాంచీ, గాయత్రి రవిశంకర్, తేజ్ చరణ్‌రాజ్, కార్తిక్ సాహస్, రాజారావు, ఫిష్ వెంకట్, మస్త్ అలీ, భానుతేజ, లక్ష్మణ్, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్, చతుర్వేది తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.