Leading News Portal in Telugu

Prithviraj Sukumaran: ‘సలార్’ విలన్ ఫ్యామిలీ చూశారా.. ఎంత అందంగా ఉందో కదా


Prithviraj Sukumaran: ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. వేరే భాషల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా అనగానే విలన్ గా మరో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారు. అలా సలార్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్. మలయాళం లో పృథ్వీరాజ్ ఒక స్టార్ హీరోనే కాదు.. డైరెక్టర్, నిర్మాత ఇలా ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నింట్లోనూ ప్రావీణ్యం పొందిన హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఒక్క ఏడాదిలోనే దాదాపు 10 నుంచి 15 సినిమాలు షూటింగ్ చేసి రిలీజ్ చేస్తున్న ఏకైక హీరో పృథ్వీరాజ్. ఇక సలార్ తో తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్, శృతిహాసన్ జంటగా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబుతో పాటు పృథ్వీరాజ్ కూడా విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.

Anushka: ట్రోల్స్ చేస్తారనే స్వీటీ.. ఇలా చేస్తుందా..?

ఇక తాజాగా నేడు మలయాళీల ఓనమ్ పండుగను జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజున మలయాళీ సెలబ్రిటీలు అందరూ తమ కుటుంబంతో ఓనమ్ పండుగను జరుపుకున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సైతం తన కుటుంబంతో దిగిన ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. అన్నా, వదిన, చెల్లి అమ్మతోపాటు ఆయన కుమార్తెలతో పృథ్వీరాజ్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంతో అందమైన ఫ్యామిలీ అని, సూపర్ కుటుంబం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి సలార్ లో పృథ్వీరాజ్ ఎలాంటి విలనిజాన్ని చూపిస్తాడో చూడాలి.