Leading News Portal in Telugu

Rajini: జైలర్ కి షాక్… కలెక్షన్స్ ఫుల్ ఉండగానే ఒరిజినల్ ప్రింట్ లీక్…


సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చి… ఎన్ని ఏళ్లు అయినా తలైవర్ కి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదని నిరూపించాడు. కోలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా జైలర్ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. నెల్సన్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ లు జైలర్ సినిమాని వర్త్ వాచ్ గా మార్చాయి. డే 1 నుంచి రికార్డుల వేటలో పడిన జైలర్ సినిమా పది రోజులు తిరిగే సరికి కోలీవుడ్ లో ఉన్న అన్ని బాక్సాఫీస్ ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ తప్ప మిగిలిన అన్ని సినిమాల కలెక్షన్స్ ని దాటి జైలర్ సినిమా టాప్ ప్లేస్ కి అడుగు దూరంలో ఉంది. ఈ వీకెండ్ కూడా మంచి హోల్డ్ ని మైంటైన్ చేస్తే జైలర్ సినిమానే టాప్ ప్లేస్ లో ఉంటుంది. తమిళనాడులో మాత్రమే కాదు జైలర్ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉంది.

కేవలం ఓవర్సీస్ లోనే జైలర్ సినిమా 24 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది అంటే రజినీ ర్యాంపేజ్ ఏ రేంజులో అర్ధం చేసుకోవచ్చు. తెలుగ, కన్నడ, మలయాళ భాషల్లో బాహుబలి 2, కేజీఎఫ్ 2 తర్వాత 50 కోట్లు రాబట్టిన సినిమాగా జైలర్ నిలిచింది. ఇప్పటికీ థియేటర్స్ లో మంచి ఆకుపెన్సీ మైంటైన్ చేస్తున్న జైలర్ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే జైలర్ థియేట్రికల్ రన్ కి షాక్ ఇస్తూ ఒరిజినల్ ప్రింట్ విత్ 5.1 ఆడియో ఆన్లైన్ లో లీక్ అయ్యింది. థియేటర్స్ లో బాగా ఆడుతున్న సినిమా ఇలా ఆన్లైన్ లో లీక్ అవ్వడం బాధాకరం. అయితే తలైవర్ ఫ్యాన్స్ మాత్రం ఆన్లైన్ లో లీక్ అవ్వడం కాదు ఓటీటీలో ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా కూడా మేము రజినీకాంత్ ని థియేటర్స్ లోనే చూస్తాం అంటూ జైలర్ యూనిట్ కి అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్, మరి ఈ లీకుని తట్టుకోని జైలర్ సినిమా ఎంత స్ట్రాంగా నిలబడుతుంది అనేది చూడాలి.