Leading News Portal in Telugu

Prabhas Pawan kalyan: ఇది డైనోసర్ల దండయాత్ర…


ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంది, ఈలోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా థియేటర్లోకి రావడానికి మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది కానీ ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. టీజర్ తప్పితే ట్రైలర్ అప్డేట్ ఇవ్వడం లేదు. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. సలార్ ట్రైలర్ సెప్టెంబర్ 3న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రేపో మాపో దీని గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే… 2,3 తేదీల్లో సోషల్ మీడియా తగలబడిపోతుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

సలార్ ట్రైలర్‌కు ఓ రోజు ముందే సెప్టెంబర్ 2న ఓజి టీజర్ రాబోతోంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఓజి టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. #TheyCallHimOG, #SalaarTrailer అనే ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్, పవన్ మ్యూచువల్ ఫ్యాన్స్‌ మరింత రచ్చ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఊరమాస్‌గా తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తమ దాహం తీర్చే ఏకైక సినిమా సలార్ అని గట్టిగా నమ్ముతున్నారు. ఇక ఓజి సినిమా పవన్ కెరీర్లోనే హై ఓల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రెండు సినిమాలు మరణ మెంటల్‌ మాస్‌గా రాబోతున్నాయి. అలాంటి సినిమాల నుంచి ఒక్క రోజు గ్యాప్‌లో టీజర్, ట్రైలర్ బయటికొస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.